Jai Lava Kusa – On Par Or Bigger Than Baahubali 2జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ బాక్సాఫీస్ నే షేక్ చేస్తుందని భావించిన “జై లవకుశ” ఆ స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, అటు ఓవర్సీస్ లో కూడా భారీ బజ్ ను క్రియేట్ చేసిన ‘జై లవకుశ,’ ఆల్ టైం రికార్డ్ మాట పక్కన పెడితే, కనీసం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో అయినా నెంబర్ 1 స్పాట్ కు చేరుకుంటుందా? లేదా? అనేది సందేహంగా మారింది.

ప్రీమియర్ షో మరియు ఫస్ట్ డే కలెక్షన్స్ ద్వారా దాదాపుగా 1 మిలియన్ కు చేరువ అవుతుందని అంచనా వేస్తుండగా, టాక్ సరిగ్గా లేకపోవడానికి తోడు, రివ్యూలు కూడా ప్రతికూలంగా రావడంతో, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం హిట్ అయిన “నాన్నకు ప్రేమతో” సినిమాను ‘జై లవకుశ’ దాటుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. శని, ఆదివారాలు సాధించబోయే కలెక్షన్స్ దీనికి సమాధానం చెప్పనుంది.

‘నాన్నకు ప్రేమతో’ 2 మిలియన్ క్లబ్ లో నిలువగా, ఆ తర్వాత ‘జనతా గ్యారేజ్’ 1.8 మిలియన్స్ తో నిలిచింది. ‘బాద్ షా’ 1.2 మిలియన్స్, ‘టెంపర్’ 1 మిలియన్ తో మొదటి నాలుగు స్థానాలలో నిలువగా, ప్రస్తుత అంచనా ప్రకారం రెండు లేక మూడు స్థానాలలో ‘జై లవకుశ’ నిలుస్తుందని ట్రేడ్ టాక్. అయితే వీకెండ్ లో అనూహ్యమైన కలెక్షన్స్ అందుకుంటే మాత్రం నెంబర్ 1 కావడం పెద్ద కష్టమైన విషయం కాదు.