JAI character  in Jai Lava Kusaమరో అయిదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ”కు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఓ పక్కన మీడియా ఛానల్స్, ఎఫ్ఎంలకు ఇంటర్వ్యూలు ఇచ్చే పనిలో హీరోహీరోయిన్లు, దర్శకులు ఉండగా, మరో పక్కన సోషల్ మీడియాలో పోస్టర్ల ద్వారా పబ్లిసిటీ ఉధృతిని పెంచుతున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం అన్ని “జై” పాత్రకు సంబంధించిన స్టిల్స్ ను మాత్రమే వినియోగిస్తుండడం గమనించదగ్గ విషయం.

ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో… ‘జై లవకుశ’ అంటే ఒక్క ‘జై’ పాత్ర మాత్రమే కాదని, ఇందులో ‘లవకుశ’లు కూడా కీలకమేనని స్పష్టంగా చెప్పారు. కానీ పబ్లిసిటీ మాత్రం కేవలం ‘జై’ పాత్ర చుట్టూనే తిరుగుతుండడం అభిమానుల్లో ఎలాంటి సంకేతాలను పంపిస్తుంది. పవర్ ఫుల్ పాత్రలో ‘జై’ కనిపించనున్న విషయం స్పష్టం. అందుకు అనుగుణంగానే ఈ స్టిల్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. తాజాగా విడుదలైన మరో స్టిల్ కూడా ‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.

జూనియర్ కు బ్యాక్ గ్రౌండ్ గొడుగు పడుతుండగా, మరొకరి భుజంపై తన కాలును పెట్టి ఉన్న ఈ స్టిల్ అదిరిపోయింది. ఓ పక్కన వాన పడుతున్న వాతావరణం బ్యాక్ గ్రౌండ్ లో హైలైట్ గా నిలిచింది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా అడ్వాన్సు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. యుఎస్ లో బంపర్ ప్రైస్ లతో పాటు, వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్లు కూడా ఓపెన్ అయ్యాయి. మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ముఖ్యమైన సెంటర్స్ లో అడ్వాన్సు బుకింగ్స్ ఓపెన్ అయ్యి రికార్డుల దిశగా సాగుతోంది.