YS Sharmila's Complaint About Affair with Prabhas Rumoursఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ నెల 14న జరగాల్సిన ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమం వాయిదా పడింది. రేపు ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా నిన్న రాత్రి కార్యక్రమం వాయిదా పడిందని పార్టీ వర్గాలు మీడియాకు తెల్పడం విశేషం. ఈ కార్యక్రమం మళ్లీ ఎప్పుడు జరిగేది తరువాత తెలియజేస్తామని వారు మీడియాకి తెలిపారు. అయితే వాయిదాకి కారణం ఒకింత ఆశ్చర్యంగా ఉంది.

జగన్‌ సోదరి షర్మిల, బావ అనిల్‌ జ్వరంతో బాధ పడుతున్న కారణంగా గృహ ప్రవేశ కార్యక్రమం వాయిదా పడిందని పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. షర్మిలకు, ఆవిడ భర్త అనిల్ కు ఒకేసారి జ్వరం రావడమేంటి? రాకూడదని కాదు కాకపోతే ఒకింత ఆశ్చర్యంగానే ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కావాల్సి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి కార్యక్రమం రద్దు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది.

అయితే కేసీఆర్ తో అంటకాగడం జగన్ కు అంత మంచిది కాదని, ప్రజలలో దీనిపై వ్యతిరేక భావం ఉందని ప్రశాంత్ కిషోర్ టీం నివేదిక ఇవ్వడంతో జగన్ ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో పక్క ఈ విషయం జగన్ కి ఇంత ఆలస్యంగా అర్ధం కావడం కూడా విశేషమే. గత నెలలో కేటీఆర్ జగన్ కు కలిసినప్పటి నుండీ ఇది ఆ పార్టీకి సెల్ఫ్ గోల్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. జగన్ కు చాలా ఆలస్యంగా ఈ విషయం బోధ పడిందనే చెప్పాలి. తెరాస అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ కేసీఆర్ ఈ పర్యటన సందర్భంగా జగన్ ను గెలిపించమని ఏపీ ప్రజలకు పిలుపునిస్తారని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో ఈ కార్యక్రమం రద్దు కావడం విశేషం. అయితే రేపు జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకానున్నారు. అక్కడ జరిగే అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొంటారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. సహజంగా ఆధ్యాత్మిక టూర్లలో కేసీఆర్ రాజకీయ వ్యాఖ్యలు చెయ్యరు కాబట్టి ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఉండకపోవచ్చు. శారద పీఠానికి గత రెండు నెలలలో కేసీఆర్ రావడం ఇది రెండో సారి. శారద పీఠం స్వామి జగన్ అనుకూలమైన వ్యక్తిగా ఎప్పటి నుండో పేరు ఉంది.