జగన్ ప్రభుత్వం వేలుపెట్టి భ్రష్టు పట్టించని రంగం బహుశః రాష్ట్రంలో ఒక్కటి కూడా మిగలలేదేమో? పాఠశాలలు, విద్యావ్యవస్థ, దేవాలయాలు, సినిమా టికెట్లు, మద్యం, ఇసుక, ఆక్వా చెరువులు… ఇలా చెప్పుకొంటూపోతే చాలానే ఉన్నాయి. ఆ జాబితాలో కొత్తగా క్రీడా రంగం కూడా చేరింది.
గత ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎక్కడికక్కడ ఇండోర్, అవుట్ డోర్ మినీ స్టేడియంలను కట్టించింది. వాటిలో వివిద క్రీడలకు సంబందించి పరికరాలు, క్రీడాకారుల శిక్షణ కోసం కోచ్‌లను కూడా ఏర్పాటు చేసింది.
ఇప్పుడు మన జగనన్న హయాంలో ఆ స్టేడియాలలో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకొనేందుకు నెలకు ఇంత అని ఫీజులు నిర్ణయించి అమలుచేస్తోంది. పల్నాడు జిల్లా నరసారావుపేటలో ఇండోర్ స్టేడియంలో షటిల్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాలని తెలియజేస్తూ స్టేడియం నిర్వహిస్తున్న అధికారులు బుదవారం బోర్డులు పెట్టారు. ఫీజు చెల్లించేవారిని మాత్రమే లోనికి అనుమతిస్తామని ఖరాఖండీగా చెపుతున్నారు. 14 ఏళ్ళు పైబడినవారికి సెక్యూరిటీ డిపాజిట్ రూ. 2,000+నెలకు రూ.1,000, 14 ఏళ్ళలోపు వయసున్న పిల్ల సెక్యూరిటీ డిపాజిట్ రూ. 1,000+నెలకు రూ.500 ఫీజు చెల్లించాల్సిందేనాని అధికారులు చెపుతున్నారు.
అయితే షటిల్ బ్యాట్, షటిల్ కాక్స్, బూట్లు, సాక్సులు కొనుక్కోవడానికే చాలా ఇబ్బంది పడుతుంటే నెలకు వెయ్యి రూపాయలు ఎక్కడి నుంచి తేగలమని ప్రశ్నిస్తున్నారు. అంత ఫీజు చెల్లించలేమని, ఇదివరకులా తమను స్టేడియంలో ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోనీయాలని క్రీడాకారులు అభ్యర్ధించారు. కానీ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేశారు.
కనీసం ఫీజు చెల్లించేందుకు కొంత గడువు ఇవ్వాలని కొందరు క్రీడాకారులు అభ్యర్ధించారు కానీ అధికారులు నిరాకరించి స్టేడియం గెట్లకు తాళాలు వేసి వెళ్ళిపోయారు. దీంతో షటిల్ క్రీడాకారులు స్టేడియం గేటు వద్ద బైటాయించి ధర్నా చేశారు. బయట ప్రైవేట్ స్టేడియంలో నెలకు రూ.700 ఫీజు ఉంటే ప్రభుత్వం నిర్మించి, నిర్వహిస్తున్న స్టేడియంలో నెలకు వెయ్యి రూపాయల ఫీజు వసూలు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ వారు గోడు వినేదెవరు?
Jagananna sports thousa