YS-Jagan's--Decision-Driving-Away-InvestmentsYS-Jagan's--Decision-Driving-Away-Investmentsగత ప్రభుత్వం అధిక ధరలకు విద్యుత్‌ ఒప్పందాలను చేసుకుందని ఏపీ సీఎం ముఖ్యసలహాదారు అజేయ కల్లం అన్నారు. ఈ ఒప్పందాల్లో పారదర్శకత ఉండాలని సీఎం జగన్‌ భావిస్తున్నారని, పీపీఏలపై సమీక్ష నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. “గత మూడేళ్లల్లో చేసుకున్న పీపీఏల్లో అవకతవతలు ఉన్నాయి.. దేశవ్యాప్తంగా పవన, సౌర విద్యుత్ ధరలు తగ్గాయి.. సోలార్ విద్యుత్ ధరలు రూ. 2.40, పవన విద్యుత్ ధరలు రూ. 2.43కు తగ్గాయి, పీపీఏల్లో సుమారు ఆరు రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది,” అని ఆయన చెప్పుకొచ్చారు.

“ఇటువంటి పీపీఏలు రాష్ట్రానికి అవసరమా..? దీని వల్ల రాష్ట్రానికి ఆర్ధిక భారం కాదా..?,” అని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో “పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు రాకుండా పోతాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. తప్పులు జరిగితే పీపీఏల వంటి కీలక ఒప్పందాలను రద్దు చేసుకుంటామని చెప్పే గట్స్ ఉన్న సీఎంలు కొందరే ఉంటారు. అలాంటి కోవకే వైఎస్ జగన్‌ చెందుతారు,” అని కితాబు ఇచ్చారు అజేయ కల్లం. అయితే పెట్టుబడులు రాకుండా పోతాయని దుష్ప్రచారం చేసింది ఎవరు?

ఇప్పటివరకు కేంద్రం నుండి దీని మీద రెండు లేఖలు వచ్చాయి. ఒకటి చీఫ్ సెక్రటరీకి, ఒకటి ముఖ్యమంత్రికి. ఆ లేఖలలో సదరు మంత్రిత్వశాఖ పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు రాకుండా పోతాయని అనుమానం వ్యక్తం చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం జగన్ సర్కారుపై దుష్ప్రచారం చేస్తుందా? ఒప్పందాలు చేసుకున్న సంస్థలతో చర్చలు జరుపుతామని.. ధరలు తగ్గిస్తే ఆ ఒప్పందాలను కొనసాగిస్తామని లేదంటే రద్దు ఖాయమని అజేయ కల్లం స్పష్టం చేశారు.