Jagan AP High court2019 ఎన్నికలు… దేశం నివ్వెరపోయేలా 151 సీట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ అమోఘమైన విజయం. సహజంగా అభివృద్ధి మంత్రం జపించే చంద్రబాబు చాలా వరకు సంక్షేమం చేసినా టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా దారుణమైన ఫలితం.

ఓటమి సంగతి ఏమో గానీ ఆ రేంజ్ ఫలితాలు చంద్రబాబు గానీ ఇంకొకరు గానీ ఊహించి ఉండరు. అయితే ఇది గాలివాటపు గెలుపు అయితే కాదు. ఒక పథకం ప్రకారం చంద్రబాబు పై, లోకేష్ పై వ్యక్తిత్వ హనం చేసే ప్రయత్నం జరుగుతుండగా చంద్రబాబు అండ్ కో నిద్రావస్థలో ఉండిపోయింది.

ఈ క్రమంలో చంద్రబాబు ఎన్నో ఏళ్లగా సంపాదించుకున్న క్రెడిబిలిటీని కూడా దెబ్బతీశారు. చంద్రబాబు గానీ, తెలుగుదేశం పార్టీ గానీ ఒక వర్గం కోసమే పని చేస్తుందని ప్రజల బుర్రల్లో ఎక్కించారు. అందుకు అమరావతిని వాడుకున్నారు.

చంద్రబాబు సామాజికవర్గం చాలా లిమిటెడ్ స్థాయిలో ఉండే ప్రదేశాన్ని కమ్మనాడు అననంతగా ప్రచారం చేసి… దాని పై ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ప్రచారం తో ప్రజలలో అనుమానాలు రేకెత్తించారు. అందుకు ఫలితమే 2019లో వచ్చిన ఫలితాలు. అయితే ఇది ఒక్క ఎన్నికల ఫలితాల విషయమో లేక టీడీపీ పరపతి విషయమో కాదు.

ఎన్నికలైన రెండున్నర సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి. ఇక పరిశ్రమలు… పెట్టుబడుల సంగతి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో చేసిన అప్పులు ప్రభుత్వం మారినా వచ్చే ప్రభుత్వాలను కూడా ఇబ్బందిపెట్టేవి.

ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలలో ప్రాధమిక సాక్ష్యాలు కూడా లేవని కోర్టులు తేల్చి చెప్పేశాయి. మరి అమరావతి చుట్టూ నడిచిన డ్రామా రాష్ట్రానికి అయితే ఉపయోగపడలేదు అని తేలిపోయింది. మరి ఎవరికి మేలు చేసింది? ఇదంతా చుసిన తరువాత జగన్ గెలుపు… అబద్దాల పునాదిరాళ్ల మీద వేసుకున్న సింహాసనం అని అంటే కాదనలేం.