jagan ticket price hike isssue ఆంధ్రప్రదేశ్ లోని టిక్కెట్ రేట్ల విషయంలో ఇప్పట్లో పరిష్కారం కష్టమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చేసింది. టిక్కెట్ రేట్ల విషయంగా మీటింగ్ అని చెప్పి… ప్రభుత్వానికి కావాల్సిన ఆన్లైన్ పోర్టల్ గురించి మాత్రమే చర్చించి సరిపెట్టేసింది.

మొన్నటివరకు మీటింగ్ కోసం సిన్సియర్ గా ట్రై చేసిన చిరంజీవి వంటి వారు… రెండు మార్లు జగన్ అప్పాయింట్మెంట్ రద్దు చెయ్యడం… సీఎంతో మీటింగ్ అని చెప్పి మంత్రితో కూర్చోబెట్టడం వంటివి చెయ్యడంతో ఇక సైలెంట్ అయిపోయారు. ఇక ఈ సమస్య పరిష్కారం అయినప్పుడు అయ్యిందనుకోవాలి అన్నట్టు ఉన్నారు అంతా.

కొన్ని సినిమాలు దసరాకు విడుదల కానున్నాయి. దసరా తప్పితే సంక్రాంతి వరకూ సరైన డేట్స్ లేవు. ఉన్నా కొన్ని సినిమాలు ఇప్పటికే ఆ డేట్స్ బ్లాక్ అయిపోయాయి. ఈ పరిస్థితులలో పెద్ద సినిమాలు కొన్ని రోజులు ఆగుతాయేమో గానీ చాలా మీడియం, మీడియం కంటే కొద్దిగా పెద్ద సినిమాలకు ఈ పరిస్థితి కష్టమే.

ఇంకో మూడు రోజుల్లో విడుదలయ్యే లవ్ స్టోరీ… అలాగే అక్టోబర్ సినిమాలు ఈ రేట్ల మీద కూడా అనూహ్యంగా పెర్ఫర్మ్ చేసేసి భయంకరమైన లాభాలు తెచ్చిపెడితే తప్ప చాలా సినిమాలు ఓటీటీ దారి చూసుకోవడం ఖాయం. దాదాపుగా రెండు ఏళ్ల పాటు జరుగుతున్న ఈ ఆలస్యాన్ని ఇక భరించే పరిస్థితిలో నిర్మాతలు లేరు.

అదే జరిగితే లాక్ డౌన్ లో కూడా ఓటీటీలకు లేని డిమాండ్ ఇప్పుడు రావొచ్చు. అప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్లకు ఏ మాత్రం విశ్వాసం ఉన్నా జగన్ ఫోటో పెట్టుకుని పూజలు చెయ్యాలి!