అమరావతి ప్రజల అనుమానాలు జగన్ తుడిచెయ్యగలరా?

Jagan stand on capital amaravatiఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన గృహప్రవేశానికి ముహూర్తం ఎట్టకేలకు ఖారారైంది. ఈ నెల 14న జరగాల్సిన ఆ కార్యక్రమం షర్మిల ఆరోగ్యం బాగోక వాయిదా వేస్తున్నామని పార్టీ నేతలు ప్రకటించారు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి లో నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి ఈ నెల 27న ఆయన గృహ ప్రవేశం చేయనున్నారు. అదే ముహూర్తాన పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. లండన్ పర్యటనలో ఉన్న జగన్ రేపు తిరిగొస్తున్నారు.

నూతన గృహప్రవేశం తర్వాత ఇకపై తాడేపల్లి నుంచే వైసీపీ కార్యక్రమాలను జగన్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 28న తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ సమర శంఖారావం సభలో జగన్ పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పార్టీల అధినేతలతో అమరావతిలో సొంత ఇల్లు కలిగిన నేత ఒక్క జగన్ మాత్రమే. ఇప్పటివరకూ హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ నివాసం నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న జగన్ ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ కు షిఫ్ట్ అవ్వడం గమనార్హం. ఇందులో కూడా ఒక లెక్క ఉంది.

రాజధాని ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అధికారపార్టీ గట్టిగా ప్రచారం చేస్తుంది. జగన్ అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి నుండి తరలిస్తారని ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రభావం చాలా వరకు కృష్ణా, గుంటూరు జిల్లాల మీద పడేలా ఉంది. దీనిని ఎదురుకోవడానికి జగన్ అమరావతికి మకాం మారుస్తున్నారు. చంద్రబాబు అయితే ఇన్ని సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉంటున్నారు… నేను సొంత ఇల్లు నిర్మించుకుని ఉంటున్నా అని అక్కడి ప్రజలలో భరోసా నింపడానికి ప్రయత్నం చేస్తారు. చూడాలి ఇది ఎంతవరకు సఫలం అవుతుందో?Follow Mirchi9 on Google News

This Week Releases on OTT – Check ‘Rating’ Filter

Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to [email protected]com

Nagarjuna Akkineni Meets YS Jagan Mohan ReddyDon't Missనాగార్జున కి స్పేస్ ఇవ్వని జగన్ !హీరో నాగార్జున కి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి మంచి రిలేషన్ ఉంది. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి...Singireddy-Niranjan-Reddy_YS SharmilaDon't Missమంగళవారం మరదలా ? ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదా మంత్రి గారు.వైఎస్ఆర్ ఫ్యామిలీ కి పాద యాత్ర సెంటిమెంట్ ఉంది. దివంగత రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆయన తనయుడు జగన్ మోహన్...Allu Arjun's Well Planned And Executed PR CampaignDon't MissAllu Arjun's Well Planned And Executed PR CampaignStylish Star Allu Arjun is the Chief Guest for Naga Shaurya's Varudu Kaavalenu Pre-release event...Allu Arjun about pushpa movieDon't Missఇదేంటి బన్నీ ఇలా అనేశాడు !త్వరలో రాబోతున్న బడా సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందులో 'పుష్ప' ఒకటి. బన్నీ -సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న...hardwork done by tdp janasena supporters pawan kalyan thefting thatDon't Missకష్టం టీడీపీ ది...కట్టింగ్ పవన్ కళ్యాణ్ ది !ఇటీవలే కాలంలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ గా అడ్డాగా మారుతోందని , ఏ రాష్ట్రంలో డ్రగ్స్ పట్టుబడిన దాని మూలాల ఆంధ్రానుండే...

Mirchi9