తెలుగు పలకడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. మైక్ పట్టుకుని మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి జగన్ రెడ్డి తడబడడం, తప్పులు పలకడం చాలా సర్వ సాధారణంగా మారిపోయింది. సీఎం అయిన నాటి నుండి వీటికి లెక్కిస్తే, బహుశా ఈ సంఖ్య నాలుగు అంకెలకు చేరుకుంటుందేమో!
తాజాగా రాష్ట్ర ప్రజలకు ‘ఉగాది శుభాకాంక్షలు’ చెప్పేందుకు మైక్ పట్టుకున్న జగన్, వాటిని పలకడంలో తడబాటుకు గురై, మరోసారి నెటిజన్లకు అవకాశం కల్పించారు. దీంతో జగన్ పలికిన ‘ఉగాది శుభాకాంక్షలు’ వీడియో వైరల్ అవుతూ నెట్టింట సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ కోవలోనే సాక్షి మీడియా ప్రతినిధులు కూడా పలుకుతుండడం మరో విశేషం.
‘చెట్టు’ ఒకటైతే ‘కాయ’ మరొకటి అవుతుందా? అన్న చందంగా జగన్ సొంత మీడియా కూడా ఆయననే అనుసరిస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. బహుశా రాత్రంతా తమ నాయకుడి వీడియో చూసి, వాళ్ళు కూడా ఇలాగే అయిపోయారేమోనన్న కామెంట్స్ వెలువడుతున్నాయి.
NTR Arts: Terrified NTR Fans Can Relax!
SVP Result: A Wakeup Call To Jagan?