jagan ration door deliveryఇంటి వద్దకే రేషన్ అంటూ జగన్ ప్రభుత్వం అట్టహాసం ప్రారంభించిన స్కీం త్వరలోనే అటకెక్కబోతుందని సమాచారం. ఈ స్కీం వల్ల లబ్ధిదారుల నుండి డెలివరీ చేసేవారు, రేషన్ డీలర్లు ఎవరూ ఆనందంగా లేకపోవడంతో ప్రభుత్వం ఈ స్కీం ను ఉపసంహరించుకోకతప్పదని అంటున్నారు.

దాదాపుగా అన్ని జిల్లాలలో సరుకులు పంపిణీ చేయలేమంటూ వాహనాల ఆపరేటర్లు తప్పుకుంటున్నారు. తమకు వస్తున్న రూ.21 వేలు.. పెట్రోల్‌, వాహన ఈఎంఐ, హమాలీకే సరిపోతోందని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ కూడా అందడం లేదని ఆపరేటర్లు వాపోతున్నారు. తమకొచ్చే జీతంలో ఏమీ మిగలట్లేదని.. వెట్టి చాకిరి చేయడం తప్ప ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే వాహనాలను తిరిగి ఇచ్చేస్తున్నామని ఆపరేటర్లు స్పష్టం చేస్తున్నారు. పైగా వాహనం తీసుకునే సమయంలో తాము రూ.70 వేల వరకు ఖర్చు పెట్టామని.. దాన్ని ఇచ్చేస్తే వేరే ఉపాధి చూసుకుంటామని చెబుతున్నారు. ఇప్పటికే ఒక మారు వారికి ఇచ్చే డబ్బులను ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే ఇది అనవసరపు ఖర్చుగా ప్రభుత్వం భావిస్తుంది.

లబ్దిదారులు కూడా వ్యాన్ ఎప్పుడు వస్తుందో తెలీకుండా పనులు ఆపుకుని ఎదురుచూపులకే సరిపోతుందని పాత పద్దతే మెరుగని వారు అంటున్నారు. దీనితో ఈ స్కీం ను ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. స్కీం అమలకు ముందు కనీసం మంచిచెడులు గురించి ఆలోచన చెయ్యకుండా ముందుకు వెళ్తే ప్రజాధనం వృధా అవుతుంది అనే దానికి ఉదాహరణ ఇది. ఇప్పుడు ఆ రేషన్ పంపిణీకి కొన్న బండ్లకు లోన్లు కట్టుకుని… వాటిని ఏం చెయ్యాలో కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలి.