jagan raghurama krishnam raju issueవైఎస్సార్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ సర్కారుకు ఏకుమేకై కూర్చుకున్నారు. ముందు టీవీలలో కనిపించి వేధించేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి లేఖాస్త్రాలు సంధించి… రాష్ట్రంలో జరుగుతున్న వాటిని ఢిల్లీ వరకు తీసుకెళ్లి జగన్ సర్కారు పరువు తీస్తున్నారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వానికి కోర్టుల కూడా ఇబ్బందులు సృష్టిస్తున్నారు.

రఘురామ కృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నాడే… పార్టీ తరపున లోక్ సభ స్పీకర్ కు ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని లేఖ ఇచ్చారు ఆ పార్టీ ఎంపీలు. అయితే ఇప్పటిదాకా ఆయన పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నిన్న ఒక ప్రెస్ మీట్ లో ఆ విషయాన్ని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రస్తావించారు.

“టీడీపీ నుండి వైసీపీలోకి చేర్చుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హులుగా చేసి, అనక ఎంపీ రఘురామరాజు ని మీ వైసీపీ పార్టీ నుండి బహిష్కరించి, అప్పుడు అనర్హత గురించి లోకసభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే బాగుంటుంది కదా? అది చేయకుండా మీరు చేసే ప్రయత్నాలకు విలువ ఉండదు,ఫలితం ఉండదు జగన్ సాబ్,” అని వారు ఆక్షేపిస్తున్నారు.

ఆ రకంగా రఘురామ కృష్ణరాజు సస్పెన్షన్ గురించి పట్టుబట్టే మోరల్ గ్రౌండ్ వైఎస్సార్ కాంగ్రెస్ ఎప్పుడో కోల్పోయింది అని అంటున్నారు ప్రత్యర్ధులు. నిజమే మరి మన విషయంలో విలువలు పాటించాల్సిన అవసరం ఉందని భావిస్తే… అవతలి వారికి ఆ విలువలను మనం పాటించి చూపించాలి కదా!