Jagan - Pawan-Kalyanజీ తెలుగులో అదిరింది అనే షో లో చేసిన ఒక స్కిట్ పై ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు చిందులు తొక్కుతున్నారు. ఆ షోలో ఒక ఆర్టిస్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇమిటేట్ చెయ్యడంతో దానికి ఎప్పటిలానే యాంకర్ శ్రీముఖి, జడ్జి నాగబాబు విరగబడి నవ్వుతున్నారు.

ఆ క్లిప్ వైరల్ అవ్వడంతో వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు జీ తెలుగు మీద, సదరు ఆర్టిస్టు మీద, నాగబాబు మీద, శ్రీముఖి మీద బూతులతో విరుచుకుపడుతున్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే… జగన్ ను టార్గెట్ చెయ్యడం మొదటి సారేమో గానీ ఇది తరచు జరుగుతున్నదే.

ఎన్నికల ముందు మధ్య చంద్రబాబు మీద నందమూరి కుటుంబం మీద ఇదే వైఎస్సార్ కాంగ్రెస్ రామ్ గోపాల్ వర్మ తో ఒక సినిమా కూడా తీయించారు. దానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఒకరితో ఫైనాన్స్ కూడా చేయించారు. అప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా ఆనందించారు.

ఇప్పుడు తమదాకా వచ్చే సరికి బాధపడిపోతున్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు మెగా ఫామిలీలోని ఆడవారిని సైతం వదలకుండా బూతులు తిట్టేస్తున్నారు. అటువంటి ఎజెండాతో కూడుకున్న సినిమాలను, షోలను ఆదరిస్తే లేదా ప్రోత్సహిస్తే ఎప్పుడో ఒకప్పుడు తమకు కూడా తగులుతాయని గుర్తించకపోవడం వల్ల జరిగింది ఇది. ఇప్పటికైనా తెలుసుకుంటారో లేక మేము ఎన్నైనా ఎవరినైనా అనొచ్చు మమ్మల్ని మాత్రం అనకూడదు అని సరిపెట్టుకుంటారో చూడాలి.