KCR TelanganaKCR Jaganరాష్ట్రంలో బీజేపీ బలపడుతుంది… తెరాస పై ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అని వార్తలు వస్తున్న తరుణంలో కేసీఆర్ లో మార్పు కనిపించింది. పల్లె, పట్టణ ప్రగతి పనుల ఆకస్మిక తనిఖీ పేరిట జూన్ 19 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చెయ్యబోతున్నట్టు సమాచారం. ఏడేళ్ళ అధికారంలో కేసీఆర్ ప్రజల మధ్యకు విస్తృతంగా వెళ్లడం ఇదే మొదటిసారి.

మరోవైపు… ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా రికార్డు స్థాయిలో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్… గెలుపు తరువాత తన తాడేపల్లి ఇంటినే క్యాంపు ఆఫీసు గా మార్చుకుని నాలుగు గోడలకే పరిమితం అయిపోయారు.

ఎన్టీఆర్ తరువాత కనీవినీ ఎరుగని మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పూర్తిగా మొహం చాటేశారు. మొదట్లో రెండు మూడు నెలలకు ఒకసారి ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో కనిపించేవారు. ఏడాది కాలంగా కరోనా వంకతో అది కూడా లేదు. ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్ లో ఉంటున్నారని అధికార పక్షం వారు విమర్శిస్తున్నా జగన్ ఏపీలో ఉంటున్నారు అనే మాటే గానీ ప్రజలకు టీవీలో తప్ప దర్శనం ఇవ్వడం లేదు.

దీనితో కేసీఆర్ ని చూసైనా జగన్ లో మార్పు వస్తుందేమో చూడాలి. ప్రజలకు నాయకులకు ఆ కనెక్షన్ కట్ అయిపోయి… అధికారంలో ఉన్నవారు తమలో ఒకరు కాదు…. తమను ఏలే వారే అనే అభిప్రాయం ఏర్పడితే అధికారం లో ఉన్న పార్టీకి అప్పుడే ఇబ్బందులు మొదలైనట్టు. అయితే దానిని జగన్ గ్రహిస్తారో లేదో చూడాలి.