Jagan next target on TDP mangalagiri office constructionఇటీవలే జరిగిన ఎన్నికలలో టీడీపీ అధికారం కోల్పోయింది. తన చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా 23 ఎమ్మెల్యేలకు, 3 ఎంపీలకు పడిపోయింది. టీడీపీని కబళించడానికి ఒక పక్క జగన్, మరోపక్క మోడీ చేస్తుండడంతో తెలుగుదేశం పార్టీకి ఇది పరీక్షా కాలం అనే చెప్పుకోవాలి. పైగా లోకేష్ ఓటమితో చంద్రబాబు తరువాత ఎవరు అనే ప్రశ్న కూడా వేధిస్తుంది.

ఈ క్రమంలో ఆ పార్టీ కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టబోతుంది. మంగళగిరి సమీపంలో తెలుగుదేశం పార్టీ నూతనంగా నిర్మిస్తున్న రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి నవంబరు 3 తేదీ, ఆదివారం సాయంత్రం 7.19 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ప్రభుత్వం అది అక్రమానిర్మాణం అంటూ కొత్త వాదన తెర మీదకు తెచ్చింది.

భవన నిర్మాణానికి ప్రభుత్వం 3 ఎకరాల 65 సెంట్లను కేటాయించగా ఒక రైతుకు చెందిన భూమిని కూడా ఆక్రమించుకున్నారని, పైగా పక్కనే ఉన్న వాగును పూర్తిగా పూడ్చి టీడీపీ కార్యాలయం నిర్మిస్తున్నారని ప్రభుత్వ వాదన. అంతే కాకుండా రెండు బేస్‌మెంట్‌లు, మూడు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకుని మూడు బేస్‌మెంట్‌లు, నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఈ విషయం మా పరిశీలనలో తేలిందని, ఎంత మేర పూడ్చి ఎంత భూమిని ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారో మరోసారి పరిశీలించి నిర్మాణదారులకు నోటీసులు జారీ చేస్తాం అని మంగళగిరి తాసిల్దార్ చెప్పారు. అయితే ఇది కేవలం కక్షసాధింపు చర్య అని చంద్రబాబుకు నిలువ నీడలేకుండా చెయ్యడానికే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ వారి ఆరోపణ.