jagan mohan reddy tirumala controversyహిందువులను ఆకట్టుకోవాలని జగన్ చేసిన, చేస్తున్న ప్రయత్నం మరో సారి బెడిసికొట్టింది. హిందూ సంప్రదాయాల పేరుతో ఎంతగా జగన్‌ని వివాదాల్లోకి లాగితే, అంతగా వైఎస్సార్సీపీకి నష్టం కలుగుతుందనీ, అది టీడీపీకి మేలు చేస్తుంది. ఆ విషయం తెలిసి కూడా మళ్ళి జగన్ ఆ ఉచ్చులో పడ్డారు.

పడ్డాడు అనేకంటే తన అంతటా తానే నడుచుకుంటూ వెళ్లి ఆ ఉచ్చులో పడ్డాడు అని చెప్పుకోవాలి. పుష్కరాలకు వెళ్ళినప్పుడు జగన్‌, హిందూ సంప్రదాయాల ప్రకారమే పితృదేవతలకు తర్పణాలు వదిలినప్పుడు, తిరుమలకి వెళ్ళి ‘డిక్లరేషన్‌’ మీద సంతకం చేసేస్తే వచ్చే నష్టమేంటో ఎవరికీ తెలియని మిస్టరీ.

తిరుమలలో వైఎస్‌ జగన్‌ చుట్టూ ఎందుకు అంత హంగామా ఉంటుంది అనేది ఎవరికీ అర్ధం కాదు. తిరుమల సందర్శన అంటే సింపుల్ గా జగన్ తన కుటుంబ సభ్యులతో వెళ్లి దేవదేవుడిని దర్శించుకోవచ్చు. కాకపోతే ప్రతిసారి ఆయనతో 200-300 మంది తక్కువ కాకుండా వస్తారు. వారు మరియు జగన్ ప్రైవేట్ సెక్యూరిటీ చేసే హడావిడి అంతా ఇంతా కాదు.

తిరుమల క్యూ లైన్లలో, మాడవీధుల్లో ‘జై జగన్’ అంటూ నినాదాలు ఇవ్వడం ఏంటో ఎవరికీ అర్ధం కాదు. ఇలాంటి హంగామాతో హిందువుల మనసు ఎలా గెల్చుకోవాలనుకుంటున్నారో జగన్ కే తెలియాలి. 3000 కిలోమీటర్లు నడిచాక మళ్ళి తిరుమలకు వెళ్లి తన పాదయాత్ర ముగిస్తా అని జగన్ ఇదివరకు చెప్పారు. అప్పటికైనా తప్పులు దిద్దుకుంటే ఆయనకే మంచిది.