jagan honoured AP volunteersఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో బాగా పనిచేస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లకు సత్కారమంటూ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకిలో ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. వలంటీర్లకు విశిష్ట సేవా పురస్కారాలను ప్రతి సంవత్సరం అందించనున్నారు. ఈ పురస్కారాలకు ప్రభుత్వం 240 కోట్లు ఖర్చు చేస్తోంది.

సేవా మిత్ర అవార్డుకు రూ.10 వేలు, సేవా రత్న అవార్డుకు రూ.20 వేలు, సేవా వజ్ర అవార్డుకు రూ.30 వేలతో వాలంటీర్లకు పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి తాను తీసుకుని వచ్చిన వాలంటీర్ల వ్యవస్థ మీద ప్రశంసలు కురిపిస్తే… ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

ఈ క్రయక్రమంలో ఏపీ వ్యాప్తంగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి.. దేశంలోని ప్రజలంతా జగనే ప్రధాని కావాలని కోరుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి. పార్థసారథి మాట్లాడుతున్న సమయంలో.. అక్కడున్న వాలంటీర్లు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్దగా కేకలు, విజిల్స్ వేసి సందడి చేశారు.

ఆ సమయంలో సీఎం జగన్ సైతం ప్రతిస్పందనగా.. చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. అయితే ఈ మాటలు అనడానికి బానే ఉన్నాయి. ఇటువంటివి మోడీ వింటేనే ప్రాబ్లెమ్ అంటూ పలువురు సోషల్ మీడియాలో చురకలు వేస్తున్నారు. ప్రధాని అవ్వాలనుకోవడం కాదు అవ్వే అవకాశాలు దూరంగానైనా ఉన్న నేతలకు ఏమైందో మనం ఆల్రెడీ చూశాం అని వారు వారించడం గమనార్హం.