Jagan govt spends public money on adsకొన్ని విషయాలు పెద్దవాళ్లను చూసి చిన్నవాళ్లు నేర్చుకుంటారు. వాళ్లను అనుకరించాలనుకుంటారు వాళ్లు ఎలా చెబితే…అలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు .

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే…కాకలు తీరిన కేసీఆర్ లాంటి రాజకీయ నాయకులను చూసి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లాంటి కుర్ర నేతలు నేర్చుకోవడంలో ఎలాంటి తప్పులేదు.

ప్రభుత్వాలు అన్నప్పుడు ప్రతిపక్షాలు ఉండనే ఉంటాయి. ప్రభుత్వంపై నిప్పులు చెరగడం శరామూములే. ప్రతిపక్ష నేతలు వాళ్ల నోటికి ఏది వస్తే అతి మాట్లాడుతుంటారు. ప్రజలకు చేరేలా వాళ్లకు అనుకూలంగా వాదలను వినిపిస్తుంటారు.

మరి దీనికి కౌంటర్ విసిరేందుకు అధికార పక్షం కూడా రెడీగా ఉండాలి. వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. అంతేకానీ కోట్లకు కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇస్తే ఏం ప్రయోజనం ఉంటుంది.

ప్రకటనల కన్నా..నాయకులు మాట్లాడిన మాటలే చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. తొందరగా ప్రజలకు అర్థమవుతాయి. ఇక ప్రతిపక్ష మీడియా ప్రసారం చేయకున్నా…మిగతా కొన్ని మాత్రం ప్రసారం చేస్తుంటాయి. ఉదాహరణకు పెట్రోలు ధరలు కావచ్చు….ఇతర విషయాలు కావచ్చు. మీడియా కావచ్చు….ప్రతిపక్ష నేతలు అయ్యిండొచ్చు. వారికి అనుకూలంగా వార్తలను వారు పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. జనానికి విషయానికొస్తే అవే నిజాలు కావచ్చని నమ్మే ప్రమాదం కూడా ఉంటుంది.

కాగా కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇవ్వడం కాదు కావాల్సింది. ప్రాంతానికో ఒక మంత్రి ఉన్నారు…లేదా ఆర్థిక మంత్రి ఉన్నారు. పెట్రోలు ధరల మీద ప్రభుత్వం వాదనను వినిపించే సత్తా మీకు లేదా? నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారు. కేంద్రం చేస్తున్న అన్యాయాలను దుయ్యబట్టారు. దమ్ముంటే చూసుకుందాం కాస్కో అన్న రేంజ్ లో సవాల్ చేశారు.

మరి ఏపీ ముఖ్యమంత్రి ఇలా అరస్తూ గగ్గోలు పెట్టాల్సిన పనిలేదు. కనీసం ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనల్లో ఉన్న దాన్ని క్లియర్ గా వివరించాలి. పెట్రోలు, వంట గ్యాస్ ధరలు పెంచిన పాపం కేంద్రానిదో…రాష్ట్రానిదో అని ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలి.

జగన్ వాదన నిజం కావచ్చు…కాకపోవచ్చు. లేదంటే కేంద్రానిదే పూర్తి తప్పంటూ దుయ్యబట్టొచ్చు. ఇదే విషయాన్ని మీడియా ముందుకు వచ్చి జగన్ జనాలకు వివరిస్తే బాటుంటుంది.

ఏదోక మీడియా ఏం రాసుకుంటే నాకేంటీ..? ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు…తర్వాత వచ్చే ఎన్నికల్లోనూ అదే మెజార్టీతో గెలిపిస్తారన్న అతి విశ్వాసంతో ముందుకు వెళ్లినట్లయితే అసలుకే మోసం వస్తుంది.

ఉప ఎన్నికల విజయాలు శశ్వాతం కాదని గుర్తించాలి. మరి జగన్ రెడ్డి ఆ విధంగా ఆలోచిస్తున్నారా…? ఏమో ఎవరికి తెలుసు…జగన్ కాస్త డిఫరెంట్ గా ఆలోచించే నాయకుడు కదా…ఎవ్వరికీ అర్థం కారు…కాలేరు.