jagan government Negotiations with union leaders6వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెకు దిగుతామని ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన ఉద్యోగ సంఘాల పైన చర్యలకు జగన్ సర్కార్ సిద్ధమైంది. ఓ పక్కన ఉద్యోగ సంఘ నేతలతో చర్చలు జరుపుతూనే మరో పక్కన గనుల శాఖ ఉద్యోగులపై ఎస్మాను ప్రయోగించి, తాము దేనికైనా సిద్ధమన్న సంకేతాలను జగన్ సర్కార్ పంపిస్తోంది.

తాజాగా జరిపిన చర్చలలో హెచ్ఆర్ఏ కు సంబంధించి పలు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. జనాభా ప్రాతిపదికన తీసుకున్న ఈ నిర్ణయం వివరాలేమిటంటే…

50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో 10 వేల సీలింగ్ తో 8 శాతం హెచ్ఆర్ఏ
2 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో 10 వేల సీలింగ్ తో 9.5 శాతం హెచ్ఆర్ఏ
5 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో 12 వేల సీలింగ్ తో 13.5 శాతం హెచ్ఆర్ఏ
10 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో 15 వేల సీలింగ్ తో 16 శాతం హెచ్ఆర్ఏ
సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయ ఉద్యోగులకు 23 వేల సీలింగ్ తో 24 శాతం హెచ్ఆర్ఏ ఇస్తామన్న ప్రతిపాదనలు ప్రభుత్వం నుండి వ్యక్తమయ్యాయి. ఫిట్ మెంట్ మాత్రం 23 శాతంకు మించి ఇవ్వబోమని మరోసారి స్పష్టం చేసారు. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ప్రొహిబిషన్ తర్వాతే కొత్త పీఆర్సీ ఇస్తామని, ఇంకా పెండింగ్ అంశాలను ఎనామిల్ కమిటీకి పంపాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఒకవేళ వీటికి అంగీకరించి సమ్మెను విరమించుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న దానికి ఉదాహరణగా గనుల శాఖపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. గనుల శాఖా డైరెక్టర్ వెంకటరెడ్డి జారీ చేసిన ఈ ఉత్తర్వులు బయటకు వచ్చాయి. ముందుగా అత్యవసర శాఖలైన వైద్య శాఖపై ఎస్మాను ప్రయోగిస్తారు, కానీ జగన్ సర్కార్ మాత్రం గనుల శాఖపై ప్రయోగించారు.

ఉద్యోగులను భయపెట్టే క్రమంలో ఈ ఉత్తర్వుల జారీ అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చర్చల దశలో ఉండగానే ఈ ఎస్మా ప్రయోగం అందుకేనని, ఈ శాఖపై ప్రయోగిస్తే, ఇతర శాఖా ఉద్యోగులు భయపడి సమ్మెకు వెళ్లకుండా ఉంటారనే భావనలో ముందస్తుగా ఈ చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

YSRCP-Govt-Notice