Jagan government in tough situationకరోనా సెగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాను కూడా తాకింది. లాక్ డౌన్ కారణంగా ఏపీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తం అయిపోయింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం రోజుకి రెండు కోట్ల రూపాయల ఆదాయం కూడా రాని పరిస్థితి నెలకొందని సమాచారం. రాష్ట్రం పూర్తి స్థాయిలో అప్పుల మీద, విరాళాల మీద నడపాల్సిన పరిస్థితి వచ్చిందట.

ఈ క్రమంలో మార్చ్ నెల జీతాలు ఇవ్వాల్సిన టైం కూడా వచ్చింది. దీనితో ప్రభుత్వం ఎటూ పాలుపోని స్థితిలో ఉంది. దీనితో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మార్చ్ నెల జీతాన్ని రెండు దఫాలుగా ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. పొరుగున ఉన్న తెలంగాణాలో జీతాలతో కోతలు విధించారు. అయితే అటువంటి సాహసం జగన్ చెయ్యలేరు.

తెలంగాణాలో అన్ని స్థానిక ఎన్నికలూ అయిపోయాయి అయితే ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితి సద్దుమణగగానే జరుగుతాయి. దీనితో జగన్ రిస్క్ తీసుకోలేరు. అయితే ఈ ఇంస్టాల్మెంట్ పద్ధతి కూడా అంత తేలిక కాదని సమాచారం. మొదటి విడత అప్పులతో ఎలాగోలా తిప్పలు పడినా, రెండో విడతకు ఆ అవకాశం కూడా లేదని అంటున్నారు.

ఏప్రిల్ 14తో లాక్డౌన్ పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కేసులు ఎక్కువ కావడంతో ఇంకా పెంచే అవకాశం ఉంది. అదే జరిగితే ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం అవుతుంది. కేంద్రం సాయం చేస్తుంది అనుకుంటే అక్కడి పరిస్థితులు కూడా అంతంత మాత్రమే. దీనితో ముఖ్యమంత్రి దేవుడిపైనే భారం వేసి రెండు విడతలను అని ప్రకటించారు.