Jagan government in risk with Election commissioner letterజగన్ ప్రభుత్వం లో తనకు భద్రత లేదంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ కేంద్రానికి ఫిర్యాదు చేశారా లేదా అనేదాని మీద క్లారిటీ వచ్చేసింది. రమేష్‌ కుమార్‌ నుంచి కేంద్ర హోంశాఖకు లేఖ వచ్చిందని.. లేఖపై ఏపీ సీఎస్‌తో కేంద్ర హోంశాఖ కార్యదర్శి మాట్లాడారన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి.

కేంద్రం కూడా ఆయనకు ఇప్పటికే భద్రత పెంచింది. అది పక్కన పెడితే ఐదు పేజీల ఆ లేఖలో ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని అధికారపక్షం ఎలా అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘించి, ఎన్నికలలో దౌర్జన్యానికి దిగింది అనేది అంకెలతో సహా రమేష్ కుమార్ కేంద్రం దృష్టికి తెచ్చారు.

అలాగే 2014తో పోల్చితే ఎలా ఏకగ్రీవాల సంఖ్య అనూహ్యంగా పెరిగిందో కూడా చెప్పారు. దీనితో ఇప్పుడు ఎన్నికల భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి కేంద్ర బలగాల పహారాలో మరో సారి మొదటి నుండి ఎన్నికలను నిర్వహించాల్సిందే.

అదే గనుక జరిగితే జగన్ ప్రభుత్వానికి చాలా అప్రతిష్ట. మళ్ళీ ప్రక్రియ మొదటి నుండి జరిపితే వచ్చే ఫలితాలు ప్రభుత్వానికి కచ్చితంగా ఆశించిన స్థాయిలో ఉండవు. ఈ కారణంగానే ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలు వాయిదా అనగానే రమేష్ కుమార్ మీద విరుచుకుపడ్డారు. అనుకున్న ప్రకారం ఎన్నికలు జరిగేలా విశ్వప్రయత్నాలు చేశారు.