Jagan's Latest Strategy: If Cant Satisfy the People, Confuse Themఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎపి నెంబర్ ఒన్ గా వచ్చింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ఈ ర్యాంకింగులలో ఏపీ 2016 నుండి నెంబర్ వన్ పొజిషన్ లో ఉండటం గమనార్హం. 2019 మర్చి 31వరకూ అమలైన సంస్కరణల బట్టి ఇచ్చిన ర్యాంకులు అని కేంద్రం ప్రకటించినా ఆ క్రెడిట్ తమ ప్రభుత్వానిదే అంటూ జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం గమనార్హం.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన వివిధ చర్యల వల్లే ఎపి నెంబర్ ఒన్ గా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో వచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చెప్పారు. కరోనా దుర్భర పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం తోడ్పాటు ఇచ్చిందని ఆయన చెప్పారు. పరిశ్రమలు మళ్లీ నడిచేలా ఆర్థిక తోడ్పాటు, భరోసాను ముఖ్యమంత్రి కల్పించారని ఆయన అన్నారు.

సరే చంద్రబాబు సంగతి పక్కన పెడదాం… కేంద్రం ఇచ్చిన ర్యాంకులు 2019 సంవత్సరానికి అని స్పష్టంగా చెప్పింది మరి దాంట్లో కరోనా ఎఫెక్ట్ ఏముంది? ఈ ఏడాది జనవరిలో గానీ ఇండియాలో మొదటి కరోనా కేసు నమోదు కాలేదు. ఆ తరువాత రెండు నెలలు ప్రభుత్వం కరోనా అనేది పెద్ద విషయమే కాదు అన్నట్టు మాట్లాడింది.

ఇప్పుడు 2020లోని కరోనా ఎఫెక్ట్ ని ఎదిరించి 2019లో నెంబర్ వన్ ర్యాంకు తెచ్చేసుకున్నాం అది కూడా మేము అధికారంలో లేకుండా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకోవడం దారుణం అనే చెప్పుకోవాలి. పైగా ఇవే ర్యాంకులను ప్రతిపక్షంలో ఉండగా అసలు ర్యాంకులే కాదు అని వారే అనడం మరో కొసమెరుపు.