Jagan Government confusion over local body elections 2020ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. 50 శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాల్సిందిగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికలకు 59.85 శాతం రిజర్వేషన్లు కలిపిస్తూ జీవో నెంబర్ విడుదల చేసింది. ఇప్పుడు ఆ జీవోపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ ‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

కాగా హైకోర్టు దానిపై స్పందించకుండా ఎన్నికల ప్రక్రియను కొనసాగించవచ్చని తెలిపింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం నోటీసులు మాత్రమే జారీ చేసింది. ప్రభుత్వ వాదన విన్న తరువాత నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈనెల 17న నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది.

దానితో పిటీషనర్లు సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు నోటిఫికేషన్ వాయిదా పడటంతో ఎన్నికల నిర్వహణ నాలుగు వారాల పాటు నిలిచిపోయినట్టే. ఓటమికి భయపడి సాధ్యపడని రిజర్వేషన్లను తెచ్చి ప్రభుత్వం కావాలనే ఎన్నికలు వాయిదా పడేలా చేసిందని ప్రతిపక్షాలు విమర్శించడం గమనార్హం.