అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో ప్రభుత్వం కొత్త వాదన

Jagan Government Amaravati inside tradingఅమరావతి భూముల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగుతుంది. ఈ విచారణ పై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీం తలుపు తట్టింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ వర్తించదని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌లో తప్పేముందని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

రాజధాని అంశం బహిరంగ రహస్యమని హైకోర్టు చెప్పడంలో తప్పేముందని, భూములు అమ్మినవాళ్లు మోసపోయామని ఎక్కడైనా ఫిర్యాదు చేశారా? అని అడిగింది. నష్టం వచ్చిన వాళ్లే కోర్టును ఆశ్రయించాలి కానీ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని ధర్మాసనం ప్రశ్నించింది.

గత హియరింగ్ లో సుప్రీం చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో ప్రభుత్వానికి అనుకూల తీర్పు వచ్చే అవకాశం లేదని అనిపించడంతో ప్రభుత్వం కొత్త వాదన వినిపించింది. భూముల బదలాయింపు చట్టం ప్రకారం కొనుగోలుదారులు భూములను ఎందుకు కొనుగోలు చేస్తున్నారో అమ్మకందారులకు చెప్పాలన్నారు. ఈ విషయంలో అమ్మకం దారులు మోసపోయారన్నారు.

అయితే ఈ వాదన అయినా ఎలా నిలబడుతుంది అనేది అనుమానేమే. తమ దగ్గర భూమి కొనుగోలు చేసిన వారు తమకు కారణం చెప్పకుండా కొన్నారని అందుకని తాము మోసపోయామని ఎవరైనా పోలీసులను ఆశ్రయించారా? ఒకవేళ ప్రభుత్వ వాదన నిజమే అనుకుంటే కొనుగోలుదారులు తాము సొంతానికి భూమి కొనుక్కుని ఆ తరువాత రాజధాని వస్తుందని తెలుసుకున్నాం అని చెబితే ప్రభుత్వం ఏం చేస్తుంది?

ఏ రకంగా చూసినా ఈ కేసులో ప్రభుత్వ వాదనలలో పెద్దగా పస కనిపించడం లేదు. మరి సుప్రీం కోర్టు ఏం నిర్ణయిస్తుందో చూడాలి. విచారణ ఒప్పుకుంటే తమ విజయం… ఒప్పుకోకపోతే… వ్యవస్థలను మ్యానేజ్ చేశారు అనే సాకు ఎలానూ ఉంది కదా?

Follow @mirchi9 for more User Comments
Dosti Music RRR - HemaChandra, MM Keeravaani -Jr NTR-Ram Charan-RajamouliDon't MissRRR Song – Thematic Yet Appealing With Goosebumps EndingThe first song, Dosti, of the most awaited movie of the year RRR, is out....Sankranthi 2022 Dates - Here's The Biggest Gainers And LosersDon't MissSankranthi 2022 Dates - Here's The Biggest Gainers And LosersThe Sankranthi 2022 biggies’ dates are out with the announcement of the release date of...Prashant Kishor - YS JaganDon't MissPrashant Kishor Pushes Jagan Into A FixA Newspaper report has carried that Political strategist Prashant Kishor has met YSR Congress MP...Ishq: Not A Love Story Movie ReviewDon't MissIshq: Not A Love Story Review - A Terrible RemakeBOTTOM LINE A Terrible Remake OUR RATING 2/5 CENSOR 'U/A', 1h 55m What Is the...Don't MissThimmarusu Review - Over-Smart, Yet Watchable!BOTTOM LINE Over-Smart, Yet Watchable OUR RATING 2.75/5 CENSOR 'U/A' What Is the Film About?...
Mirchi9