Jagan Government గతంలో కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ పెట్టే పరిస్థితులు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు కావాలని పట్టుబట్టింది అధికార పార్టీ. ఎన్నికలు వాయిదా వేశారని ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎప్పుడు మీడియా ముందుకు కూడా రాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ కులపరమైన ఆరోపణలు చేశారు.

ఆ తరువాత ఆయనను తప్పించి… సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత కోర్టుతో మొట్టికాయలు వేయించుకుని మరీ తిరిగి నిమ్మగడ్డను నియమించారు. కాగా… ఇప్పుడు దేశంలో అన్ లాక్ కారణంగా ఎన్నికలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. బీహార్ వంటి పెద్ద రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతుంది.

దీనితో ఏపీలో స్థానిక ఎన్నికలు పెట్టాలని హైకోర్టులో పిల్ పడింది. దానిపై విచారణ జరిపిన హైకోర్టులో వాదనలు జరిగిన సందర్భంగా కరోనా సమస్య కారణంగా ఎన్నికల నిర్వహణ కష్టమని తెలిపింది. అయితే బీహారులో ఎన్నికలు పెడుతున్నారు కదా అని హైకోర్టు వ్యాఖ్యానించినట్టు సమాచారం. దీనిపై ఎన్నికల కమిషనర్ అభిప్రాయం తెలపాలని హైకోర్టు నోటీసు ఇచ్చింది.

ఈ కేసు విచారణను నవంబర్ రెండుకు వాయిదా వేసింది. ప్రపంచమంతా ఎన్నికలు వద్దు అన్న సమయంలో ఎన్నికలు కావాలని వాదించింది రాష్ట్ర ప్రభుత్వం.. దాని కోసం ఏకంగా సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళింది. అయితే ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తరుణంలో కష్టం అంటుంది ప్రభుత్వం. నిమ్మగడ్డ సారథ్యంలో ఎన్నికలను ఎదురుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ భయపడుతోందా?