Jagan cracks a joke - eleminating corruptionప్రస్తుతం పాదయాత్ర చేస్తోన్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, విరామ సమయంలో ఓ మీడియా ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎప్పుడూ తన మీడియా సంస్థ అయిన సాక్షికే జగన్ ఇంటర్వ్యూలు పరిమితం అవుతుంటాయి, కానీ ఈ సారి అందుకు విరుద్ధంగా మరో మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడంతో, ప్రాధాన్యతను దక్కించుకుంది.

ఇందులో భాగంగా జగన్ చేసిన ఓ కామెంట్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. “జగన్ అనే వ్యక్తి అధికారంలోకి వస్తే కరప్షన్ అనేదే లేకుండా చేస్తాడు” అంటూ చేసిన కామెంట్స్ కు నెటిజన్లు పడిపడి నవ్వుతున్నారు. ముఖ్యంగా ఈ అవకాశాన్ని తెలుగు తమ్ముళ్ళు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ట్విట్టర్ లో పెద్ద ఎత్తున ట్రెండింగ్ కు కారణమయ్యారు.

“#జగన్ క్రాక్స్ ఎ జోక్” అనే పేరుతో హల్చల్ చేస్తోన్న హ్యాష్ ట్యాగ్ లో దీనిపై లెక్కలేనన్ని జోకులు పేలుస్తున్నారు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కూడా బరిలో ఉండడంతో, ఇందులో ‘జనసేన’ అభిమానులు కూడా భాగస్వామ్యులు అయ్యారు. ఇంతకీ జగన్ వేసింది జోక్ యేనా? లేక అధికారంలోకి వస్తే నిజంగానే అవినీతి అంతం చూస్తారా? మీరూ చెప్పొచ్చు.