Jagan be humiliated once again?అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ గగ్గోలు పెట్టి మూడు రాజధానులను తెర మీదకు తెచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు అయ్యింది. అసలు రాజధాని భూములలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనడానికి ఎటువంటి ఆధారం లేదని అభిప్రాయపడి సుప్రీం కోర్టు విచారణకు అనుమతి ఇవ్వలేదు.

ఈ అంశం ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చేతిలో అస్త్రంగా మారనుంది. మరోవైపు.. రఘురామ కృష్ణం రాజు కేసులో ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది. రఘురామకృష్ణరాజు, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు మధ్య రహస్య బందం ఉందంటూ అందులో ఆరోపించింది.

అలాగే రఘురామ కు టీవీ5 ఏకంగా 8.8 కోట్లు చెల్లించింది అని కూడా చెప్పుకొచ్చింది. దానిపై జగన్ ప్రభుత్వం మీద పరువునష్టం దావా వెయ్యనున్నట్టు టీవీ5 యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. రఘురామకృష్ణరాజు, చంద్రబాబు కలిసి పని చేస్తున్నారు అని ప్రభుత్వం సుప్రీం కోర్టులో ప్రూవ్ చేసినా… అది ఏ రకంగా రాజద్రోహం అవుతుంది అనేది ఆశ్చర్యమే.

మరోవైపు… పార్లమెంట్ లో ఒత్తిడి చేసి రఘురామను అనర్హుడిగా ప్రకటింపచేద్దాం అంటే పార్లమెంట్ ను పెగాసస్ ఇష్యూ కుదిపేస్తుంది. ఒకవేళ అనర్హత కుదరకుండా రఘురామకు ఈ కేసులో సుప్రీం క్లీన్ చిట్ ఇచ్చేస్తే అది ప్రభుత్వానికి పెద్ద పరాభవమే అని చెప్పుకోవాలి.