Jagan Bail CaseJudgment as desired by TDPఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో వేసిన పిటీషన్ ను సిబిఐ కోర్టు కొట్టేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఆరోపణ.

అయితే అందుకు తగిన ఆధారాలు చూపించలేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు జగన్ కు ఊరటకాగా… తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా నిరాశ చెందడం లేదు.

“జగన్ కు ప్రజలు ఇచ్చిన ఐదేళ్లలో సగం పూర్తి అయ్యింది. గత ఆరు నెలల నుండి ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో జగన్ జైలు కు వెళ్తే… తరువాత జరిగే ఎన్నికల ఎజెండా మారిపోతుంది. సింపతీ ఫ్యాక్టర్ తో మిగిలిన విషయాలు మూలాన పడతాయి,” అని టీడీపీ వర్గాల విశ్లేషణ.

“2012లో జగన్ జైలుకు వెళ్ళగానే జరిగింది అదే. అప్పుడు జరిగిన ఉపఎన్నికలో అధికార కాంగ్రెస్ కూడా ఓడిపోయింది. రాష్ట్ర విభజన వంటి పెద్ద అంశం ఉండడంతో 2014 ఎన్నికల్లో పరిస్థితి మారింది. 2024 ఎన్నికలకు జగన్ ఐదేళ్ల పాలన… వైఫల్యాల మీదే జరగాలని మేము కోరుకుంటున్నాం,” అని వారు అంటున్నారు.

“ఆర్ఆర్ఆర్ ఇప్పుడు హై కోర్టుకు.. అవసరమైతే సుప్రీంకు వెళ్తారు. కొన్ని నెలల పాటు ఈ అంశం ప్రజలలో సజీవంగా ఉంటుంది అది సరిపోతుంది మాకు. బెయిల్ షరతులు ఉల్లఘించలేదు అని మాత్రమే కోర్టు చెప్పింది. జగన్ నిరపరాధి అని చెప్పలేదు కదా? కాబట్టి ఇందులో టీడీపీ కి పోయేది ఏమీ లేదు,” అని వారి విశ్లేషణ.