మూడు రాజధానుల బిల్లు రద్దు అంశం సోమవారం నాడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఉన్నట్లుండి తెరమీదకు రావడంతో ఒక రకంగా అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు.
కానీ ఒక్కరు మాత్రం ఈ అంశానికి సంబంధించి ఆదివారం వేకువజామునే ట్వీట్ వేశారు. ఆయనే కేసీఆర్ కు సన్నిహితుడు మరియు ‘నమస్తే తెలంగాణ’ పేపర్ మాజీ సీఈఓ అయిన శేఖర్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జగన్ కలిసి ముచ్చటించిన తర్వాత వేసిన ఈ ట్వీట్ కు జగన్ తీసుకున్న తాజా నిర్ణయం మరింత ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది.
Also Read – త్యాగాలకు న్యాయం కావాలి…పొత్తుకు న్యాయం చెయ్యాలి..!
“ఆంధ్రప్రదేశ్ కు అమరావతే రాజధాని, 3 రాజధానుల ప్రతిపాదన తుగ్లక్ ఆలోచన. అది వీగిపోతుంది. న్యాయపరీక్షలో ఓడిపోయే అవకాశం ఉన్నందున అందరూ గురించిన అమరావతిని రాజధాని గా గురించి, తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటే కొంతయినా గౌరవం దక్కుతుందని” శేఖర్ రెడ్డి చేసిన 2 ట్వీట్ల స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయి