Jagan BJP Somuveerrrajuగడచిన పక్షం రోజులలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో ఒక చోట హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఘటనలు జరుగుతున్నాయి. అంతర్వేది రథం తగలబెట్టిన ఘటన తరువాత వివిధ ప్రాంతాలలో దేవతామూర్తులకు అపచారం జరుగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనిని వాడుకుని బీజేపీ… జనసేన ఆంధ్రప్రదేశ్ లో పాగా వెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

అంతర్వేది రథం తగలబెట్టిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఆధీనంలోని సిబిఐకు అప్పగించినా ఆ పార్టీలు ఛలో అంతర్వేది అంటూ హడావిడి చెయ్యడమే ఇందుకు నిదర్శనం. వారి ముందస్తు అరెస్టులు అంటూ ఎక్కడ లేని ప్రచారం తెచ్చి పెట్టింది ప్రభుత్వం. మరోవైపు… ఈరోజు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరో వివాదానికి తెరలేపారు.

సహజంగా సీఎం జగన్ ఎప్పుడు తిరుమల వచ్చినా అన్యమతస్తులు సంతకం చెయ్యాల్సిన రిజిస్టర్ లో సంతకం చెయ్యకుండా వివాదాస్పదం అవుతారు. బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి వచ్చే నేపథ్యంలో ఏ మతస్థులైనా స్వామిని దర్శించుకోవచ్చు. డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిన అవసరం లేదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.

ప్రతిపక్షంలో ఉండగా జగన్ అడిగిన అందులో సంతకం పెట్టేవారు కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి కావున ఆయనను అడిగే వారు ఉండరు… ఎప్పటిలానే వెళ్లి వచ్చేయొచ్చు… అందుకోసం ఉన్నఫళంగా 1990 నుండి ఉన్న రూల్ మార్పించాల్సిన అవసరం లేదు. అనవసరమైన వివాదంతో స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా బీజేపీకి ఇంకో అంశాన్ని ఇచ్చినట్టు అయ్యింది.