jagan and KCR about Corona virus vaccinationకరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 1 నుండి 18 ఏళ్ల వయసు పైనున్న అందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తాము మాత్రం 45 ఏళ్ళ వారికి మాత్రమే ఫ్రీ గా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించింది. దానితో ఆ మిగతా ఖర్చు రాష్ట్రాలు గానీ ఆయా వ్యక్తులు గానీ పెట్టుకోవాలని చెప్పకనే చెప్పింది.

ఇప్పటికే దేశంలోని 12 రాష్ట్రాలు తమ ప్రజలకు తమ సొంత ఖర్చు తోనే వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించాయి. ఆ ప్రకారం నిన్న ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం… ఇటు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తమ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించాయి. అయితే ఇందు కోసం దాదాపుగా 2000 కోట్లు ఖర్చుపెడతామని లీకులు కూడా ఇచ్చాయి.

అయితే 2000 కోట్లు అనేది మాత్రం పబ్లిసిటీ స్టంట్ అనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లెక్కల ప్రకారం రెండు కోట్ల ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. సీరం ఇన్స్టిట్యూట్ 400 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించింది. అంటే ఏపీలో ఈ ఖర్చు 800 కోట్లు వరకు ఉండబోతుంది.

తెలంగాణ జనాభా ఏపీ జనాభా కంటే తక్కువే. అంటే తెలంగాణ లో ఈ ఖర్చు కొంచెం తక్కువే ఉంటుంది. అంటే రెండు రాష్ట్రాలు కలిపినా ఆ ఖర్చు 2000 కోట్లు దాటదు. అయితే రెండు ప్రభుత్వాలు మాత్రం ఒక్కొక్కరు 2000 కోట్లు దీని కింద ఖర్చుపెడతామని తమ అనుకూల మీడియాలో డప్పు వేయించుకుంటున్నారు.