ys jagan aerial surveyరాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలు ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరో పక్కన ప్రభుత్వ అలసత్వాన్ని గమనించిన ప్రతిపక్షాలు వైసీపీ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి.

అంతేగాక గతంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబును ఎద్దేవా చేస్తూ ఏమయితే వ్యాఖ్యలు చేసారో… విమర్శించారో… సరిగ్గా జగన్ ఇపుడు దానినే చేయడంతో ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా గత వీడియోలను వెలికితీస్తూ ఎద్దేవా చేస్తున్నారు.

ఇది సీఎంగా జగన్ నిర్వహించిన ఏరియల్ సర్వేకు సంబంధించింది. కేవలం విమానంలో వరద ప్రభావిత ప్రదేశాలను జగన్ తిలకించగా, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పాలు పంచుకోవడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది.

విశాఖ తీరాన్ని హుధుద్ అతలాకుతలం చేసినపుడు ఏకంగా 20 రోజుల పాటు అక్కడే ఉండి నగరాన్ని రూపురేఖలు మార్చిన ఘనతగా ఇప్పటికీ విశాఖ వాసులు బాబు పనితీరును, నిబద్ధతను కొనియాడుతుంటారు.

ప్రస్తుతం చిత్తూరు – నెల్లూరు జిల్లాల పరిస్థితి అలాగే ఉంది. ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయేలా ప్రభావితం అయిన ఈ ప్రాంతాలు ఎప్పటికి మునుపటి స్థాయికి వస్తాయోనని చర్చించుకోవడం సామాన్య ప్రజల వంతు!