Jacqueline Fernandez, Jacqueline Fernandez Swimming, Jacqueline Fernandez Whale, Jacqueline Fernandez Swimming Whale, Jacqueline Fernandez Whale Shark, Jacqueline Fernandez Swimming Whale Sharkసినిమాలలో ముద్దుగుమ్మలు స్విమ్ సూట్ ధరిస్తే ప్రేక్షకులకు పండగే. అందాల ప్రదర్శనతో ఆడియన్స్ ను తమ వైపుకు తిప్పుకోవాలన్న ఆకాంక్షతో ధరించే ఈ కాస్ట్యూమ్స్ గురించి మీడియా వర్గాలు కూడా ఆసక్తిని ప్రదర్శిస్తుంటాయి. అయితే ఒక్క ఆడియన్స్ ను మాత్రమే కాదు, సముద్ర జీవులను కూడా ఈ స్విమ్ సూట్ లతో ఆకర్షించే పనిలో బాలీవుడ్ సుందరాంగి జాక్వెలిస్ ఫెర్నాండేజ్ ఉన్నట్లుంది.

బికినీ ధరించి తిమింగలంతో పాటు స్విమ్ చేస్తున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఒక సందేశం కూడా ఇచ్చింది. ఇలా తిమింగలం పక్క నుండి వెళ్ళడం సంతోషం కలిగిస్తోందని, సముద్రాన్ని కలుషితం చేస్తూ నీటి జీవులకు హింస కలిగించొద్దంటూ చెప్పుకొచ్చింది. హీరోయిన్ల బికినీ ఫోటోలు సినిమాలలోనే కాక, సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం సర్వ సాధారణం అయిపోయిన నేపధ్యంలో… కాస్త వినూత్నంగా తన బికినీ ప్రదర్శన ఇస్తూ నెటిజన్లను ఆకర్షించే పనిలో పడింది ఈ శ్రీలంక బ్యూటీ.

ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ తో నటిస్తున్న ‘ఎ ఫ్లైయింగ్ జాట్’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ కనువిందు చేయనుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి స్పందన తెచ్చుకోవడంతో, ఈ సినిమా విజయంపై భారీ ఆశలే పెట్టుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోన్న ఈ సినిమాను ఆగష్టు 25న విడుదల చేయనుంది చిత్ర యూనిట్.