Jacqueline Fernandez , Jacqueline Fernandez Chiranjeevi, Jacqueline Fernandez Chiranjeevi Movie,  Jacqueline Fernandez Chiranjeevi 150th Movie, Sri Lanka Beauty Jacqueline Fernandez Chiranjeevi Movie, Jacqueline Fernandez  Chiranjeevi Kattilantoduమెగాస్టార్ చిరంజీవి మెగా మూవీ 150వ సినిమాలో నటించే హీరోయిన్ పై ఇప్పటికే బోలెడు పేర్లు ట్రేడ్ వర్గాల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీల నుండి టాలీవుడ్ టాల్ సుందరి అనుష్క వరకు అనేక మంది పేర్లు హల్చల్ చేయగా, ఇటీవల మాత్రం ‘చందమామ’ కాజల్ పేరు ప్రధానంగా వినపడింది. అయితే కాజల్ 150వ సినిమాకు కాదు, 151వ సినిమాలో అంటూ కొత్తగా ప్రచారం జరిగింది. అంతేగాక చిరు సరసన నటించడానికి దాదాపు 3 కోట్ల వరకు పారితోషికం అడిగినట్లుగా వార్తలు వచ్చాయి.

కాజల్ విషయంపై స్పష్టత రాక ముందే, ఇండియన్ బ్యూటీస్ ని కాదని శ్రీలంక సుందరాంగి, ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ గా చలామణి అవుతున్న జాక్వలిస్ ఫెర్నాండేజ్ తో సంప్రదింపులు జరిపినట్లుగా సినీ వర్గాల భోగట్టా. అయితే ఈ అమ్మడు కూడా కాజల్ ని మించిన పారితోషికం డిమాండ్ చేసిందని, దీంతో చిత్ర బృందం మళ్ళీ డైలమాలో పడ్డారని తెలుస్తోంది. చిరు సరసన నటించడానికి ఉచితంగా క్యూలు కడతారని భావిస్తే… కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్లు డిమాండ్ చేయడం మెగా వర్గాలను అవాక్కు చేస్తోంది.

అయితే అసలు ఈ సినిమాలో హీరోయిన్ కు పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర కాకపోయినప్పటికీ, తెలుగులో చేసిన కొన్ని మార్పులు రీత్యా, అలాగే కమర్షియల్ పాయింట్ రీత్యా, మెగాస్టార్ రేంజ్ కు తగిన విధంగా హీరోయిన్ ని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి చిరు హీరోయిన్ ఎంపిక ఎప్పటికీ పూర్తవుతుందో గానీ, మలి షెడ్యూల్ కు సినిమా సిద్ధమవుతోంది.