JAC---Jana-Sena-Pawan-Kalyanకేంద్ర రాష్ట్రప్రభుత్వాలలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేసిన సాయం గురించి ఎవరు నిజం చెబుతున్నారో తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఒక నిజనిర్ధారణ కమిటీని నియమించారు. ఆ కమిటీ తొలిసారిగా హైదరాబాద్లోని ఒక స్టార్ హోటల్ లో మీటింగుకు కూర్చుంది. అయితే ఈ కమిటీ సభ్యుల మధ్య సరైన సమన్వయం లేదన్నట్టుగానే కనిపిస్తుంది.

ఉండవల్లి తన సహజ ధోరణికి అద్దం పట్టేలా రెండు ప్రభుత్వాలను నిందించారు. రాష్ట్రప్రభుత్వం నిజాలు బయటపెట్టాము అని పబ్లిక్ గానే చెప్పుకొచ్చింది అన్నారాయన చంద్రబాబు ప్రభుత్వంపై ఎప్పటిలా ఒక రవ్వంత ఎక్కువే అక్కసు వెల్లబోస్తు. మరోవైపు లోక్ సత్తా అధ్యక్షుడు జేపీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది అన్నట్టుగానే మాట్లాడారు.

కమిటీలో మరో సభ్యుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ దీనికి సంబంధించిన సమాచారం అంతా పబ్లిక్ డొమైన్ లోనే ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే మీటింగుకు హాజరైన జేపీ, నాగేశ్వర్, మరో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కేంద్రప్రభుత్వం తప్పు చేస్తునట్టుగానే కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.

మరో పక్క కాంగ్రెస్, కమ్యూనిస్టుల అభిప్రాయాలు ఎలా ఉంటాయో మనం చెప్పాల్సిన పని లేదు. ఇటు వంటి భిన్న అభిప్రాయాలు, భిన్న రాజకీయ సంబంధాలు ఉన్న మనుషుల అభిప్రాయాలతో ఆ కమిటి ఎలాంటి రిపోర్టును తయారు చేస్తుందో? దాని బట్టి పవన్ కళ్యాణ్ ఏమని నిర్ణయానికి వస్తారో?