Jabardath Rashmi Next Comedyచిట్టిపొట్టి డ్రెస్సులతో బుల్లితెరపై ‘జబర్దస్త్’గా కనిపించే రష్మి, సిల్వర్ స్క్రీన్ పై వెలిగిపోదామని రెండవసారి “గుంటూరు టాకీస్” రూపంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అడల్ట్ ఎంటర్టైనర్ గా విమర్శకులు కితాబివ్వడంతో, అన్ని వర్గాల వారికి ఈ సినిమా చేరువ కాలేకపోయింది. అయితే ఈ సినిమాలో రష్మి నటించిన హాట్ హాట్ సాంగ్ మాత్రం ఇప్పటికీ యూ ట్యూబ్ లో దుమ్ము దులుపుతోందనుకోండి. ఇక ఆ తర్వాత నటించిన ‘అంతం’ వంటి హార్రర్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి.

దీంతో ఈ సారి అడల్ట్, హార్రర్ ను పక్కనపెట్టి కామెడీ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ చేసుకుందట. అందులో భాగంగానే ఒకప్పుడు బుల్లితెరను ఏలిన ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రధాన పాత్రకు రష్మి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ కలిసి స్థాపించిన నిర్మాణ సంస్థలో ఈ సినిమా నిర్మాణం జరుపుకోబోతోంది.

పెద్ద బ్యానర్ లో అవకాశం రావడంతో ఈ సినిమా అయినా తన సినీ కెరీర్ ను ఓ మలుపు తిప్పుతుందేమోనని ఈ ‘జబర్దస్త్’ బ్యూటీ ఆశలతో ఉందట. వెండితెరపై ఎన్ని అందాలు ఆరబోసినా, ఏ విధంగా భయపెట్టినా రానటువంటి సక్సెస్, ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిస్తే వస్తుందని భావిస్తోందట. మరి ముంచినా నువ్వే, లేపినా నువ్వే అన్నట్లుగా ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వం వహించబోతున్న తొలి సినిమా రష్మి కెరీర్ కు అత్యంత కీలకమైన సినిమాగా మారనుంది.