Shakalaka-Shankar-wedding‘జ‌బ‌ర్ద‌స్త్’ టీవీ కామెడీ షోతో మంచి పేరు తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని హాస్య‌న‌టుడు షకలక శంకర్ ఓ ఇంటివాడ‌య్యాడు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో తన మేనమామ కూతురు పార్వతి మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. ఈ పెళ్ళికి త‌న తోటి న‌టుల‌ను కూడా ఆహ్వానించ‌లేదని ష‌క‌ల‌క శంక‌ర్ చెప్పాడు.

త‌న బంధువులు కొంత మంది సమక్షంలో మాత్ర‌మే పెళ్లి వేడుక జ‌రిగింద‌ని, అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి సన్నిధిలో నా పెళ్లి జ‌రిపిస్తాన‌ని నాన్న మొక్కుకున్నారని, అందుకే పెళ్లికి వేదికగా అరసవల్లిలోని కల్యాణ మండపాన్ని ఎంచుకున్నాన‌ని తెలిపారు. పెళ్లి ఆడంబ‌రంగా చేసుకోవ‌డం త‌నకు ఇష్టం లేద‌ని, పెళ్లికి చేసే అన‌వ‌స‌ర ఖ‌ర్చు సేవాకార్య‌క్ర‌మాల‌కి వినియోగించ‌వ‌చ్చ‌ని అన్నాడు. పేద పిల్ల‌ల‌కి పుస్త‌కాలు, క్రికెట్ కిట్లు, దుస్తులు కొనిస్తాన‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి ‘సర్దార్ గబ్బర్ సింగ్‌’లో నటించ‌డం ఆనందంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నాడు.