Jaanu-Trailer-Talk---A-Faithful-Recreation-That-Can’t-Avoid-Comparisonsవిజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘96’ను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఒరిజినల్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సి. ప్రేమ్ కుమార్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది.

ఈ ట్రైలర్ ని బట్టి జాను 96కు ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దింపేశారు అనే చెప్పుకోవాలి. ఏవైనా మార్పులు కనిపించాయి అంటే అవి లొకేషన్స్ మార్పు వల్ల మాత్రమే అని చెప్పుకోవాలి. టీజర్ లా కాకుండా ట్రైలర్ లో సినిమాలోని కంటెంట్ చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒరిజినల్ దర్శకుడే ఈ సినిమాకు కూడా పని చెయ్యడంతో కథలోని ఆత్మ పోకుండా జాగ్రత్త పడ్డాడు.

అయితే సినిమా చూసే వరకూ ఒరిజినల్ సినిమాతో పోలికలు మాత్రం తప్పవు. ఊహలే ఊహలే నినువీడవులే అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు హైప్ ఇచ్చే విధంగా ఉంది. గోపీ సుందర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, మహేందరన్ జయరాజు సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే ఈ సినిమాలో రచన, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనే దాని మీదే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

అయితే సినిమా ప్రమోషన్స్ కు ఈ ట్రైలర్ మంచి స్టార్ట్ ని ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉంది. జాను ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. దిల్ రాజు నిర్మాత కావడంతో మంచి రిలీజ్ వచ్చే అవకాశం ఉంది.