Jaanu Movie Public Talkశర్వానంద్, సమంతలు జంటగా నటించిన జాను ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు డీసెంట్ టాక్ రాగా ఓపెనింగ్స్ కాస్త నిరాశాజనకంగానే ఉన్నాయి. రివ్యూలు మాత్రం చాలా వరకు బావున్నాయి అనే చెప్పుకోవాలి. దీనితో ఓవర్సీస్, యూత్ ఆడియన్స్ సినిమాను ఆదరించి కలెక్షన్స్ పెంచుతారని చిత్రబృందం ఆశిస్తుంది.

అయితే సినిమా మరీ స్లోగా ఉండటం, ఎంటెర్టైన్మెంట్ లేకపోవడం వంటి అంశాలు మాస్ ప్రేక్షకులలో, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఏమేరకు థియేటర్స్ కు రప్పించగలవో చూడాలి. దీనితో పూర్తి గా యూత్ ఆడియన్స్ మీదే చిత్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ సినిమాకు దాదాపుగా 21 కోట్ల బిసినెస్ జరిగింది. సమంత నటించిన ఓ బేబీ చిత్రం సూపర్ హిట్ అయినా 18 కోట్లే రాబట్టింది.

దీనితో ఏం జరగబోతుందో చూడాలి. జాను తమిళంలో సూపర్ హిట్టయిన 96 చిత్రం రీమేక్. ఆ చిత్రంలో విజయ్ సేతుపతి, త్రిషల యాక్టింగ్ హైలైట్ అని క్రిటిక్స్ అన్నారు. వారికి ఏ మాత్రం తీసిపోని రీతిలోనే శర్వానంద్, సమంతలు నటించి సినిమాకే హైలైట్ గా నిలిచారు.

శర్వానంద్ తన గత రెండు సినిమాలతో రెండు ప్లాపులు మూటగట్టుకున్నాడు. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఆశగా ఉన్నాడు. ఇక సమంత విషయానికి వస్తే తన గత రెండు సినిమాలు… మజిలీ, ఓ బేబీ సూపర్ హిట్ కావడంతో సక్సెస్ ని కొనసాగించాలని ఆశపడుతున్నాడు. వారికి ఏం రాసి పెట్టి ఉందొ చూడాలి.