IYR Krishna Rao Joins BJPతెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో అధికార కార్యకలాపాలు నిర్వహించి, బయటకు వచ్చిన ఐవైఆర్, అదే టిడిపి సర్కార్ పై ఎలాంటి విమర్శలు చేసారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అవన్నీ ఓ ‘ముసుగు’లో చేస్తున్నారన్న విషయం తాజాగా బయటపడింది. హైదరాబాద్ లో అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరి, తన అసలు రూపం ఏమిటో చాటిచెప్పారు.

దీంతో ఇన్నాళ్ళు వేసుకున్న బిజెపి ‘ముసుగు’ తొలగిపోయినట్లయ్యింది. ఏపీ బ్రాహ్మణా కార్పొరేషన్ చైర్మెన్ గా విధులు నిర్వహించిన ఐవైఆర్, గతంలో వైఎస్ జగన్ ను, పవన్ కళ్యాణ్ లను కూడా విడివిడిగా కలిసి చర్చలు జరిపారు. ఆ రెండు పార్టీలలో ఏదొక పార్టీలో చేరుతారని భావించగా, తెలుగు ప్రజలంతా భారీ స్థాయిలో ఆగ్రహిస్తోన్న బిజెపిలో చేరడం విశేషం. ఏది ఏమైతేనేం… మొత్తానికి ‘ముసుగు వీరుడు’ బయటపడ్డారు.

ఇదే భావనను ఏపీ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్ శిరిపురపు శ్రీధర్ కూడా చేసారు. బిజెపి చేస్తోన్న ‘ఆపరేషన్ గరుడ’లో ఐవైఆర్ ది చాలా కీలకమైన పాత్ర అని, అందుకే కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపారని, స్వార్ధం కోసం బ్రాహ్మణ సామాజిక వర్గం ప్రయోజనాలను తాకట్టుపెట్టారని, ఆఖరికి తిరుమల శ్రీనివాసుడిని కూడా గరుడ రాజకీయానికి వాడుకున్నారని ఆరోపణల వర్షం కురిపించారు.