IYR Krishna Rao Joining in YSRCPఎపి ప్రభుత్వ మాజీ ప్రదాన కార్యదర్శి , బిజెపిలో ప్రముఖుడిగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎపిలో భారతీయ జనతాపార్టీ తెలుగుదేశం ఎజెండా కోసం పనిచేస్తున్నట్లు వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దీనివల్ల బిజెపికి తీరని నష్టం జరుగుతుందని ఆయన అబిప్రాయపడ్డారు. 2019 లో వచ్చిన ఒక సదవకాశాన్ని దుర్వినియోగం చేసినట్లు అవుతుందని కూడా ఆయన స్పస్టం చేశారు.ఇలాగైతే బిజెపి నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందని కూడా ఐవైఆర్ అన్నారు.

నవ్యంధ్ర తొలి చీఫ్ సెక్రటరీగా పని చేసి ఐవైఆర్ కృష్ణారావును చంద్రబాబు అప్పట్లో బ్రాహ్మణా కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఎక్కడ చెడిందో తెలియదు గానీ ఆ తరువాత ఆయన టీడీపీ ప్రభుత్వానికి బద్ద వ్యతిరేకిగా మారిపోయి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. అమరావతికి వ్యతిరేకంగా పుస్తకాలు రాశారు. బీజేపీలో ఉంటూ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ఎజెండా అమలు చెయ్యడం, పార్టీతో ఆ లైన్ తీసుకునేలా చెయ్యడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి.

అయితే ఎన్నికల అనంతరం బీజేపీ వైఎస్సార్ కాంగ్రెస్ ను కూడా టీడీపీని విమర్శించినట్టుగానే విమర్శించడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా చంద్రబాబుని విమర్శించాలనే ఆయన కోరుకుంటున్నారని, అటువంటి పరిస్థితులు లేకపోవడంతో పార్టీలో ఇమడలేకపోతున్నారని కొందరు అంటున్నారు. దీనితో ఆయన అతితొందరలో బీజేపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ నుండి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆఫర్ ఉన్నట్టు తెలుస్తుంది.