IYR Krishna Rao tnam Parliament?ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ఇటీవలే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవలే వరకు రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసిన ఆయన ఇప్పుడు పూర్తిగా బీజేపీ మనిషిగా మారిపోయారు. నిన్న ట్విట్టర్ లో ముఖ్యమంత్రి చేసిన ఒక ట్వీట్ కు ఆయన సమాధానం మొత్తానికి ఆయన విశ్వసనీయత నే ప్రశ్నించేలా ఉంది.

“విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. న్యాయం చేయాల్సిన కేంద్రం తెలంగాణకు, మనకు గొడవలు పెట్టి రెండు రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకోవాలని చూసింది. సమస్యలు సృష్టించి ఎదురుదాడి చేస్తోంది,” అని చంద్రబాబు అన్నారు. దీనికి ప్రతిగా విభజన చేసింది కాంగ్రెస్. వచ్చిన గొడవలు కాంగ్రెస్ వారు విభజన శాస్త్రీయంగా చేయకపోవడమే. దానికి బీజేపీని నిందించడం అర్థం లేదు అని ఐవైఆర్ అన్నారు.

పైగా శీఘ్ర కాలంలో కోరిన విధంగా విద్యాసంస్థలు నెలకొల్పింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత కల్పించింది. బీజేపీకి లాలూచీ రాజకీయాలు అవసరం లేదు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలకు ఇంకెవరో ప్రభావితం చేశారనడం కోర్టు ధిక్కరణే అవుతుంది అని కొత్తగా చేరిన పార్టీని వెనకేసుకుని వచ్చారు.

అయితే గతంలో పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఐవైఆర్ కూడా అప్పటిలో ఒక సభ్యుడు. కేంద్రంనుండి రాష్ట్రానికి దాదాపుగా 75000 కోట్లు రావాలని ఆ కమిటీ నిర్ధారించింది. దీనితో ఆయన రెండు నాలుకుల ధోరణి బహిర్గతం అయ్యింది. దీనితో ఆయన 75 వేల కోట్లు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలుపరిష్కరించుకోవాల్సిన మొత్తంగా పేర్కొనడం జరిగిందే కానీ కేంద్రం నుంచి రావాలి అని రిపోర్ట్ లో చెప్పలేదు తన వాదనను సమర్ధించుకున్నారు.