IYR-Krishna-Rao-Takes-BJP-Routeగతంలో ఎన్నడూ లేనట్టుగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రిటైర్ అయ్యాక రాజకీయం మొదలు పెట్టారు. ప్రభుత్వంలో ఉంటూ తాము భాగస్తులైన నిర్ణయాలనే రిటైర్ అయ్యాక వ్యతిరేకిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వీరు చేస్తున్న కామెంట్లు ఎవరో పని గట్టుకుని చేయిస్తున్నట్టు ఉన్నాయి అండంలో ఎలాంటి సందేహం లేదు.

ఐవైఆర్ కృష్ణారావు గతంలో రిటైర్ అయ్యాక తెలుగు దేశం ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పదవిని అనుభవించి తరువాత ఎమ్మెల్సీ కావాలనుకున్నారట. అయితే ముఖ్యమంత్రి అది ఇవ్వలేకపోవడంతో ఆయన ఆగ్రహించారు. ఎన్నికలలో పోటీ చెయ్యడానికి ఆసక్తి లేకపోవడంతో బీజేపీ తరపున ఏదైనా నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారట ఆయన.

మరో సీఎస్ అజయ్ కల్లమ్ తన సామాజికవర్గానికే చెందిన జగన్ వైఎస్సాఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారట. ఇప్పటికే ఆయన ఇచ్చిన కొన్ని మీడియా ఇంటర్వ్యూలలో ప్రజలు జగన్ నాయకత్వం కోరుకోవాలని ఇండైరెక్టుగా ఆయన మనసులో మాట బయటపెట్టారంట. కాకపోతే ఎన్నికల తరువాత వరకు వీరు తటస్థులుగానే ఉంటారట.