iyr krishna raoతిరుమల ఆలయాన్ని కేంద్రం స్వాధీనం చేసుకునే కుట్ర జరుగుతోందని టిడిపి ప్రచారం చేయించిందని , ఇది దుర్మార్గమని మాజీ సీఎస్ ఐవై ఆర్ కృష్ణారావు అన్నారు. ఇందులో తను గతంలో రాసిన ఒక లేఖ కారణమని కూడా ప్రచారం చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు.

నిజానికి ఆర్కియాలజీ విభాగం దైనందిన ఆలయ కార్యకలాపాలలో ఎలాంటి బాధ్యత తీసుకోదని, కేవలం ఆలయ పరిరక్షణ బాద్యత మాత్రమే తీసుకుంటారని ,ఇప్పటికే తిరుపతి లోని ఆలయం, ద్రాక్షరామ ఆలయాన్ని ఆర్కియాలజీ శాఖ తీసుకుని వాటిని పరిరక్షిస్తోందని ఆయన అన్నారు.కావాలని ఇలాంటి దుష్ప్రచారం చేయడం తగదని ఆయన అన్నారు. ఐవై ఆర్ కృష్ణారావు తాను ఆలయ ఈవోగా ఉండగా అటువంటి ఉత్తరం రాయడం అప్పట్లో వివాదం చెలరేగాక వెనక్కు తీసుకోవడం నిజమే కదా?

దానికి ఆయన ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టేనా? ఉంటే ప్రజాగ్రహం తప్పేమీ కాదుగా? ఆర్కియాలజీ శాఖ నిర్వహిస్తున్న ఆలయాలలో అభివృద్ధి కుంటుపడుతున్న విషయం వాస్తవమే కదా? దాని బట్టి ఆయన ప్రజాగ్రహానికి అర్హుడే కదా? దీనిలో లోకేష్ ను నిందించడం వల్ల ఉపయోగం ఏమిటో? ఇందులో టీడీపీ వారి పాత్ర ఏమైనా ఉంటే అది గతంలో ఈయన రాసిన లేఖ సంగతి పైకి తేవడమే