Why is IYR Krishna Rao So Worried about BJP?రాజధాని బాండ్ల విక్రయంతో ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదని ఏపీ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణా రావు పేర్కొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..బ్యాంకు వడ్డీ కంటే అధికంగా చెల్లిస్తామని విక్రయాలు చేపడుతున్నారని…దీని వల్ల ప్రజలపై భారీగా భారం పడే అవకాశముందన్నారు. షేర్‌ మార్కెట్‌లో ఓవర్‌ సబ్‌స్రైబ్‌ మంచిదే కానీ బాండ్ల విక్రయంలో మంచిది కాదన్నారు.

60 వేల కోట్లతో ఎలక్షన్‌ ఇయర్లో టెండర్లు పిలవడం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై భారీగా భారం పడుతుందన్నారు. బాండ్ల ద్వారా వచ్చేదంతా అప్పే అవుతుందని, మళ్లీ రీయింబర్స్‌మెంట్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రజలపై భవిష్యత్‌లో పెద్దభారం పడుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి, అధిక వడ్డీ చెల్లించినపుడు స్పందన బాగా ఉంటుంది అంటూ దానిని చిన్నది చేసే ప్రయత్నం కూడా చేశారు.

అయితే కేంద్రం ఇవ్వనప్పుడు, రాజధానికి అప్పులు చేయ్యకుండా ఏం చెయ్యాలి? లోటు బడ్జెట్ తో సతమతం అవుతున్న రాష్ట్రం అధిక వడ్డీ ఆశ చూపకుండా ప్రభుత్వం గారంటీ ఇవ్వకుండా అప్పులు ఇవ్వడానికి ఎలా ముందుకు వస్తారు? ప్రపంచ బ్యాంకు నుండి అప్పుకు ప్రయత్నిస్తే కేంద్రంలోని వారి అడ్డు పడ్డారు.

అటువంటి వారికి మీలాంటి వారు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. అన్నట్టు మీరు అసలు అమరావతి అంతటి స్థాయిలో కట్టడమే తప్పు అంటారు కదా? గతంలో మీరు మన అమరావతి మన రాజధాని అని ప్లకార్డులు పట్టుకుని తీయించుకున్న ఫోటోలకు సమాధానం ఏమిటి? అప్పుడు నా పదవి కోసం పరపతి కోసం అలా వేషం వేసుకున్న అని చెబుతారా? అప్పటిది అబద్దమైతే ఇప్పటిది నిజమేలా అవుతుంది?