IYR Krishna Rao always targets chandrababu naiduమాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు చంద్రబాబు నాయుడుని ద్వేషించడమే పనిగా పెట్టుకున్నారు. రిటైర్ అయినతరువాత కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ను చేసి గౌరవించిన చంద్రబాబుకు ఆయనకు ఎక్కడ చెడిందో తెలియదు కానీ రిటైర్మెంట్ తరువాత శేషజీవితం చంద్రబాబు మీద అక్కసు వెళ్లగక్కడానికే ఉపయోగిస్తున్నారు. ఆంధ్రకు ద్రోహం చేసిన బీజేపీలో చేరారు. ఇటీవలే ఎన్నికల సంఘం చే నియమింపబడి తన పరిధి ధాటి వ్యవహరిస్తున్న చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తరపున వకాల్తా పొచ్చుకుంటున్నారు.

ఏకంగా మరో 10 మంది వృద్ధ మాజీ ఐఏఎస్ లను తీసుకుని ఎల్వీకి బాసటగా గవర్నర్ ను కూడా కలిసొచ్చారు. ఇది ఇలా ఉండగా ఆయన తాజాగా ఫణి తుఫాను పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. “దూసుకొస్తున్న ఫణి తుఫాను తమిళనాడు కు పోతుందని ఆశిద్దాం. పొరపాటున ఆంధ్ర తీరాన్ని తాకింది అంటే ఇక ముఖ్య కార్యదర్శి లక్ష్యంగా విపత్తుల నిపుణుడు తన అనుకూల మీడియా సహాయంతో చేసే హంగామా అంతా ఇంతా ఉండదు,” అని ఆయన అన్నారు.

తుఫానును కూడా రాజకీయం చేసేశారు సరే మరి ఈ తమిళనాడు మీద అక్కసు ఎందుకు? కనీసం తీరం తాకే లోపే బలహీనపడాలని కోరుకునే సంస్కారం కూడా లేకపోయిందా? పక్క రాష్ట్రం ఈయనకు ఏం చేసిందో? విపత్తుల నిపుణుడు అంటూ చంద్రబాబును హేళన చేస్తున్నారు. విపత్తుల సమయంలో చంద్రబాబు ఏం చేశారో ఏం చేయ్యగలరో కొత్తగా ఈయన సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ప్రజలకు బాగా తెలుసు. ఇటువంటి సున్నితమైన అంశాలను కూడా రాజకీయం చెయ్యకపోతే ఆయన మర్యాద నిలబడుతుంది.