ivanka-trump-likes Indian culture and traditionఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ గారాల పట్టి, ఇవాంక ట్రంప్ హైద్రాబాద్లో అడుగు పెట్టింది. భారత్ లో పర్యటించడం ఎక్సైటింగ్ గా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి సాగితే ఎంతో సాధించవచ్చని ఆమె అన్నారు.

ఒక ఆంగ్ల దినపత్రికతో ఆమె మాట్లాడుతూ ఆర్థిక వృద్ధి, సంస్కరణలను ప్రోత్సహించడం, ఉగ్రవాదంపై పోరాడటం, భద్రత సహకారాన్ని పెంపొందించుకోవడం వంటి విషయమాల్లో రెండు దేశాల ప్రాధాన్యాలని ఆమె పేర్కొన్నారు. భారత్‌ చరిత్ర, సంస్కృతి అంటే ఎంతో ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు.

ఇవాంక ట్రంప్‌ మంగళవారం తెల్లవారు జామున శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరో వైపు ఆమె పర్యటన కోసం హైదరాబాద్ శత్రుదుర్బేధ్యంగా మారింది. ఈరోజు రేపు జీఈఎస్ సదస్సుతో బిజీగా ఉండే ఇవాంక రేపు రాత్రి 9.20 గంట‌ల‌కు శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బ‌య‌ల్దేరి వెళ్తారు.