Ivanka Trumpఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవంకా ట్రంప్ మరి కొన్ని రోజుల్లో హైదరాబాద్ రానుంది. ఈ నెల 28 నుండి జరిగేప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరయ్యే అమెరికా బృందాన్ని ఆమె లీడ్ చెయ్యనున్నారు. ఇవంకాను ప్రసన్నం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం లేదు.

ప్రయత్నం అనే కంటే గారడీ అంటే మేలు. ఎందుకంటే హైదరాబాద్ కి ఎప్పుడు లేనట్టుగా ఫిషియల్ చేసి, పౌడర్ అద్ది రెడీ చేయిస్తున్నారు ఏలిన వారు. నడుములు విరిగిపోతున్నాయి మహాప్రభూ అని మోర పెట్టుకున్న ఏ నాడు పట్టించుకోని పాలకులు ఉరుకు పరుగుల మీద రోడ్లు వేస్తున్నారు. రోడ్ల పక్కన ఫుట్ పాత్ లు కూడా నిర్మించి వాటి పై మొక్కలు విద్యుత్ దీపాల అలంకరణ చేస్తున్నారు.

ఈ సోకు అంత ఎందుకంటే ఇవంకా కోసం కాదు అనే చెప్తారు కానీ ఎందుకో మన అందరికి తెలియనిది కాదు. ఇంకో విషయం ఏంటంటే ఇవంకా వెళ్లిన నాలుగు రోజులకు లైట్లు ఆగిపోతాయి. అరెస్ట్ చేసిన బిక్షాటకులు బయటకు వస్తారు. నియంత్రించిన దోశ బండ్లు మళ్ళీ రోడ్లను ఆక్రమిస్తాయి. వేసిన రోడ్లు మహా అయితే నెల రెండు నెలలో షరా మాములే అనిపిస్తాయి.

మరోవైపు వాస్తవ పరిస్థితి అర్ధం పట్టేలా హైదరాబాద్ జనతా ట్విట్టర్ లో హల చల్ చేస్తున్నారు ఒకసారి మా ఏరియాకి కూడా వస్తే మా రాతలు మా రోడ్లు కూడా బాగుబడతాయి అని మోర పెట్టుకుంటున్నారు. ఇవంకా ఇటు వంక ప్లీజ్ అంటూ. ఏలిన వారికి కోపం రావొచ్చుగాక ఇది వారి వైఫల్యం కాక మరేమిటి?