Ismar Shankar trailer releaseఎనర్జిటిక్ హీరో రామ్ పూరి జగన్నాధ్ కంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డబల్ సిమ్ కార్డు అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంపై రామ్, పూరి జగన్నాధ్ భారీ ఆశలే పెట్టుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా పూరి ప్లాపుల మీద ప్లాపులు ఇస్తున్నాడు… రామ్ కెరీర్ కూడా పెద్దగా ఆశాజనకంగా ఏమీ లేదు. ఎప్పుడో ఒక యావేరేజ్ సినిమా తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ హిట్లు ఏమీ లేవు. దీనితో ఈ సినిమాపై వారిద్దరి భవిష్యత్తు ఆధారపడి ఉంది.

ఈ తరుణంలో పూరికి ఒక శుభవార్త వచ్చినట్టు అయ్యింది. ఈ సినిమా నాన్ – థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు అయ్యాయి. జీ తెలుగు ఛానల్ సినిమాకు సంబందించిన సాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసింది. మరో థర్డ్ పార్టీ సినిమాకు చెందిన హిందీ డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసింది. మొత్తంగా ఈ డీల్ నుండి 14 కోట్లు వరకూ ముట్టిందట. ఇది పెద్ద లెక్కే. పూరి జగన్నాధ్ ఈ సినిమాను తన సొంత బ్యానర్ పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ మీద నిర్మాణం చేస్తున్నారు.

దీనితో ఆయనకు బాధ్యత రిస్క్ రెండూ ఎక్కువే. ట్రైలర్ కూడా విడుదల కాకముందే ఇవి అమ్ముడుపోవడం విశేషమే. 18న బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు కూడా రావాల్సి ఉండగా అది చివరి నిముషంలో వాయిదా పడింది. దీనితో ఇస్మార్ట్ శంకర్ కు సోలో రిలీజ్ దొరికినట్టే. 19న సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట సినిమా విడుదల ఉన్నా అది అసలు లెక్కలోకే రాదు. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణి శర్మ స్వరపరచిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.