ISI hands behind kanpur train accidentఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన 40 రైలు ప్రమాదాల వెనుక విదేశీ ఉగ్రవాదుల హస్తం ఉందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ రైలు ప్రమాదాల వెనుక విదేశీ హస్తం ఉందని, ఉగ్ర కుట్రలో భాగంగానే ప్రమాదాలు జరిగాయని ఆరోపిస్తున్న రైల్వే శాఖ, ఎన్ఐఏ చేత ప్రత్యేక దర్యాఫ్తు జరిపించాలని కోరింది. ఈ మేరకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్వయంగా హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.

కాన్పూర్ రైలు ప్రమాదానికి కారకుడైన నేపాల్ వాసి, ఐఎస్ఐఎస్ కోసం పని చేస్తున్నాడన్న విషయం వెల్లడి కావడంతో, కుట్ర కోణంపై అనుమానాలు మరింతగా బలపడ్డాయి. కొన్ని ప్రమాదాల్లో ఫిష్ ప్లేట్లు తొలగించి వుండటం, పట్టాలపై విడిభాగాలు ఉండటం వంటి సాక్ష్యాలను పరిశీలించిన తరువాత, బాహ్య శక్తుల పాత్రపై రైల్వే శాఖకు అనుమానాలు బలపడ్డాయి. గత సంవత్సరం నవంబర్ లో ఇండోర్ నుంచి పాట్నా వెళుతున్న ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి, 150 మంది మరణించిన సంగతి తెలిసిందే.