ishnu Manchu Luckunnodu Movie Teaser‘దేనికైనా రెడీ’ సినిమా తర్వాత మంచు విష్ణు ఎంపిక చేసుకుంటున్న కధలలో ఎక్కువ శాతం ‘ఎంటర్టైన్మెంట్’ సెంటరాఫ్ అట్రాక్షన్ గానే రూపొందుతున్నాయి. ఆ కోవలోనే ‘దూసుకెళ్తా, పాండవులు పాండవులు తుమ్మెద, ఈడో రకం ఆడో రకం’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే హల్చల్ చేసాయి. అలాగే ఆ మధ్యలో వచ్చిన ‘రౌడీ, అనుక్షణం, ఎర్ర బస్, డైనమైట్’ వంటి సినిమాలు సోసో…గా నిలిచిపోయాయి. దీంతో మరోసారి వినోదాన్నే నమ్ముకుని “లక్కున్నోడు” ద్వారా మరోసారి తన ‘లక్’ను పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ను విడుదల చేసారు. హీరో క్యారెక్టర్ చుట్టూ తిరిగే ‘లక్’ని వినోదాత్మకంగా దర్శకుడు చూపించాలన్న ప్రయత్నమే ఈ టీజర్ లో కనిపించింది. అయితే ఈ టీజర్ లో చూపించిన షాట్స్ అన్ని సిట్యుయేషన్ కామెడీ తరహాలో కనిపించడంతో… బహుశా వెండితెరపైన ఏమైనా వినోదాన్ని పంచుతుందేమో గానీ, ఈ టీజర్ తో ఆశించిన వినోదం మాత్రం పండలేదు. హన్సికతో కలిసి ఇప్పటికే రెండు హిట్లు అందుకున్న విష్ణుకు మరోసారి ‘లక్’ దొరుకుతుందేమో చూడాలి.